logo

బంజారాహిల్స్‌లో హోంగార్డుపై దాడి చేసింది సినీనటి

అపసవ్య దిశలో రావడమే కాకుండా విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడిన మహిళ సినీనటి సౌమ్య జానుగా బంజారాహిల్స్‌ పోలీసులు గుర్తించారు.

Updated : 28 Feb 2024 07:41 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: అపసవ్య దిశలో రావడమే కాకుండా విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడిన మహిళ సినీనటి సౌమ్య జానుగా బంజారాహిల్స్‌ పోలీసులు గుర్తించారు. ఈనెల 24న రాత్రి బంజారాహిల్స్‌ రోడ్‌ 12లోని అగ్రసేన్‌ కూడలిలో రాంగ్‌రూట్‌లో జాగ్వర్‌ కారులో వచ్చిన మహిళ అక్కడ విధుల్లో ఉన్న బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ హోంగార్డు విఘ్నేష్‌తో దురుసుగా ప్రవర్తించి, లైఫ్‌జాకెట్‌ చించివేసి, చేతిలోని చరవాణిని లాక్కొని పగులగొట్టిన సంగతి విదితమే. దాడికి పాల్పడినది సినీనటి సౌమ్యజాను అని గుర్తించి ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఇంటి వద్ద అందుబాటులో లేరని పోలీసులు తెలిపారు. అలాగే ఆమె చరవాణులు సైతం అందుబాటులో లేవని, ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరోవైపు సౌమ్యజాను ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను అత్యవసర వైద్యసహాయం నిమిత్తం రాంగ్‌రూట్‌లో వెళ్లానని, పోలీసులు క్షమించాలని కోరారు. విధుల్లో ఉన్న పోలీసులు అసభ్యంగా దూషించడం వల్ల తాను స్పందించాల్సి వచ్చిందన్నారు. అతడిపై దాడి చేయలేదని, పోలీసులు విచారణకు పిలవలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని