logo

రాజేంద్రనగర్‌లో అధికం.. హైటెక్‌ సిటీలో అత్యల్పం

ఉచిత విద్యుత్తుకు దరఖాస్తు చేసుకున్న వారిలో.. ఫిబ్రవరి 27 నాటికి కనెక్షన్‌తో ఆహారభద్రత, ఆధార్‌కార్డు అనుసంధానమైన వినియోగదారుల సంఖ్య 10.93 లక్షలుగా తేలింది. ఈ నెలాఖరు నాటికి సంఖ్య మరో ఆరేడు వేల వరకు పెరిగే అవకాశం ఉంది.

Updated : 28 Feb 2024 05:33 IST

ఉచిత విద్యుత్తుకు అర్హులుగా తేలిన లబ్ధిదారుల శాతం

ఈనాడు, హైదరాబాద్‌: ఉచిత విద్యుత్తుకు దరఖాస్తు చేసుకున్న వారిలో.. ఫిబ్రవరి 27 నాటికి కనెక్షన్‌తో ఆహారభద్రత, ఆధార్‌కార్డు అనుసంధానమైన వినియోగదారుల సంఖ్య 10.93 లక్షలుగా తేలింది. ఈ నెలాఖరు నాటికి సంఖ్య మరో ఆరేడు వేల వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే మొత్తంగా 11 లక్షల మంది మార్చి నెలలో ఉచిత విద్యుత్తుకు అర్హులుగా ఉండనున్నారు. ఫిబ్రవరి నెల వినియోగం 200 యూనిట్లలోపు ఉంటే వీరందరికి మార్చి నెలలో సున్నా బిల్లు జారీ చేయనున్నారు. అంటే కరెంట్‌ బిల్లు కట్టక్కర్లేదు. 200 యూనిట్ల వరకు గరిష్ఠంగా వాడేవారికి ఇప్పుడున్న టారిఫ్‌ ప్రకారం రూ.820, అదే 100 యూనిట్ల వరకు అయితే రూ.252.50 ప్రయోజనం లభించనుంది. సర్వీస్‌ ఛార్జీలు, విద్యుత్తు సుంకం, స్థిర ఛార్జీల రూపంలో మరో 100 వరకు పేదలకు లబ్ధి చేకూరనుంది. రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో సిటీతోపాటు శివారు ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలు వీరి పరిధిలోకి వస్తాయి. ఎక్కువ మందికి ఆహారభద్రత కార్డులున్నాయి. దీంతో ఇక్కడ అత్యధికంగా 35.05 శాతం మంది ఉచిత విద్యుత్తుకు అర్హులుగా తేలారు. అత్యల్పంగా సైబర్‌సిటీలో 17.58 శాతం మంది వినియోగదారులు లబ్ధి పొందనున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన ఆహారభద్రత కార్డుదారులు తమ వివరాలు విద్యుత్తు సిబ్బంది ఇప్పటివరకు సేకరించకపోతే మీ సెక్షన్‌ ఏఈ, ఈఆర్‌వో కార్యాలయాలను సంప్రదిస్తే వివరాలను సాసా యాప్‌లో అప్‌డేట్‌ చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని