logo

రాష్ట్రపతి నిలయానికి పోటెత్తిన విద్యార్థులు

జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు తిలకించడానికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి విద్యార్థులు పోటెత్తారు. మూడు రోజుల వేడుకల్లో మంగళవారం పరిశోధన, అభివృద్ధి సంస్థల సాంకేతికతకు సంబంధించి స్టాల్స్‌ ప్రదర్శన, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు.

Published : 28 Feb 2024 02:23 IST

బొల్లారం, న్యూస్‌టుడే: జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు తిలకించడానికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి విద్యార్థులు పోటెత్తారు. మూడు రోజుల వేడుకల్లో మంగళవారం పరిశోధన, అభివృద్ధి సంస్థల సాంకేతికతకు సంబంధించి స్టాల్స్‌ ప్రదర్శన, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఇస్రో మిసైల్స్‌, చంద్రయాన్‌ రాకెట్‌, ఉపగ్రహాల తయారీలో సాంకేతిక పరిజ్ఞానం, ఒనగూరే ప్రయోజనాలను విద్యార్థులు తెలుసుకున్నారు. కొన్ని పాఠశాలల విద్యార్థుల ఆవిష్కరణల్లో మానవ రహిత రక్షణశాఖ విమానాలు, రాడార్‌కు చిక్కకుండా బాంబులువేసే బీ2 యుద్ధ విమాన నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని