logo

నేటి సాంకేతిక విజ్ఞానమే రేపటి ప్రగతికి పునాది

శ్రీ చైతన్య విద్యార్థులు అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి అద్భుతమైన విజ్ఞాన శాస్త్ర పరికరాలను సృష్టించడం వారి ప్రతిభకు నిదర్శనమని దిల్‌సుఖ్‌ నగర్‌ ఏజీఎం ఎం సతీశ్‌ అన్నారు.

Published : 28 Feb 2024 18:17 IST

హైదరాబాద్‌: శ్రీ చైతన్య విద్యార్థులు అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి అద్భుతమైన విజ్ఞాన శాస్త్ర పరికరాలను సృష్టించడం వారి ప్రతిభకు నిదర్శనమని దిల్‌సుఖ్‌ నగర్‌ ఏజీఎం ఎం సతీశ్‌ అన్నారు. శ్రీ చైతన్య కొత్తపేట పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా వైజ్ఞానిక ప్రదర్శనను పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ వెజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్‌డీఎల్‌ శాస్త్రవేత్త సీహెచ్‌ వెంకటేశ్వర్లు విచ్చేశారు. విద్యార్థులు తయారు చేసిన నమూనాలను తిలకించారు. తరగతి గదిలో పుస్తకాల ద్వారా చదివిన విషయాలను ప్రయోగాత్మకంగా సాధన చేస్తే అవి మరింత సులభం అవుతాయన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ఆలోచనాశక్తి బయటపడుతుందని, వారి వికాసానికి దోహదపడతాయని పాఠశాల ప్రిన్సిపల్‌ కృష్ణప్రియ అన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రవీందర్‌ రెడ్డి, కో-ఆర్డినేటర్ జితేందర్, పాఠశాల డీన్‌ రామశర్మ, సి.బ్యాచ్ ఇన్‌ఛార్జి సోమయ్య, ప్రైమరీ ఇన్‌ఛార్జి భాగ్యలక్ష్మి, ఏఓ గుణశేఖర్, ఉపాద్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని