logo

కబ్జా చేసి.. నిర్మించిన రోడ్డు తొలగింపు

మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి హెచ్‌ఎండీఏ లే అవుట్‌ పార్కు స్థలాన్ని కబ్జా చేశాడని, అనధికారిక రోడ్డును శనివారం అధికారులు తవ్వించారు.

Updated : 03 Mar 2024 05:58 IST

పార్కు స్థలంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి వేసిన రహదారి ధ్వంసం

తొలగించిన సిమెంట్‌ రోడ్డు

మేడ్చల్‌, కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి హెచ్‌ఎండీఏ లే అవుట్‌ పార్కు స్థలాన్ని కబ్జా చేశాడని, అనధికారిక రోడ్డును శనివారం అధికారులు తవ్వించారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ వి.రాములు దగ్గరుండి రోడ్డును తొలగింపజేశారు. వెంచర్‌ పొడవునా వేసిన రోడ్డు పూర్తిగా తీసి ఆ స్థలంలో మట్టితో చేశారు.  కమలానగర్‌ డీఆర్‌ఎస్‌ పాఠశాల పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ వెంచర్‌లో 2500 గజాల్లో పార్కును నిర్మించారు. తన కళాశాలకు దగ్గరి దారిగా ఉంటుందని ఆ స్థలంలో రోడ్డు వేసుకున్నారు. ఇందుకు మున్సిపల్‌ తీర్మానం చేయించుకున్నారు.

నాడు ఎంపీగా రేవంత్‌రెడ్డి: దీనిపై గతంలో ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డితో పాటు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు.

నిర్మాణాలపై నోటీసులు

న్యూబోయిన్‌పల్లి సీతారాంపురంలోని మల్లారెడ్డి గార్డెన్స్‌లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సమాచారం ఇస్తూ నోటీసులు జారీ చేసినట్లు కంటోన్మెంట్‌ బోర్డు సీఈవో మధుకర్‌నాయక్‌ తెలిపారు. జీఎల్‌ఆర్‌ సర్వే నంబరు 537లోని ఏడెకరాలకు పైగా ఉన్న ఓల్డ్‌ గ్రాంట్‌ బంగ్లా స్థలంలో మల్లారెడ్డి, చందనా గార్డెన్స్‌తోపాటు పాఠశాలలు ఉన్నాయి. నోటీసులు జారీ చేసిన 8 రోజుల్లోనే కూల్చివేతలు చేపట్టొచ్చని, మరిన్ని కూల్చివేతలకు  జారీచేసే అవకాశముందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని