logo

భాజపా అభ్యర్థుల నేపథ్యం

భాజపా తొలి జాబితాలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలకు ఎంపీగా పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

Published : 03 Mar 2024 02:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా తొలి జాబితాలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలకు ఎంపీగా పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వారి నేపథ్యం ఇలా..


అభ్యర్థి పేరు: గంగాపురం కిషన్‌ రెడ్డి
నియోజకవర్గం: సికింద్రాబాద్‌
స్వస్థలం: తిమ్మాపూర్‌ గ్రామం, రంగారెడ్డి జిల్లా
చదువు : డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌
వృత్తి : రాజకీయం
కుటుంబం: భార్య కావ్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె
నేపథ్యం: జనతా పార్టీ, యువమోర్చా, భాజపాలో జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పని చేశారు. 2004లో హిమాయత్‌నగర్‌ నుంచి 2009, 2014లో అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా గెలుపొంది కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా వ్యవవహరిస్తున్నారు.


అభ్యర్థి పేరు: ఈటల రాజేందర్‌
నియోజకవర్గం:  మల్కాజిగిరి
స్వస్థలం:  కమలాపూర్‌, కరీంనగర్‌ జిల్లా
చదువు :  బీఎస్సీ
వృత్తి :  రాజకీయం
కుటుంబం: భార్య జమునారెడ్డి,  కుమారుడు, కుమార్తె
నేపథ్యం: 2003లో తెరాసలో చేరారు. ఏడాది తిరక్కుండానే కమలాపూర్‌ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో, 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో హుజురాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెరాస హయాంలో వివిధ హోదాల్లో మంత్రిగా పని చేశారు. 2023లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు.


అభ్యర్థి పేరు: కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి
నియోజకవర్గం: చేవెళ్ల
స్వస్థలం:  పెద్ద మంగళారం, మొయినాబాద్‌ మండలం
చదువు :  ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌
కుటుంబం:  సంగీతారెడ్డి (అపోలో హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌), ముగ్గురు కుమారులు (అనందిత్‌, విశ్వజిత్‌, విరాజ్‌)
నేపథ్యం: 2013లో తెరాసలో చేరిక. 2014లో చేవెళ్ల ఎంపీగా గెలుపు. 2018లో తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెస్‌ లో చేరిక. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి తెరాస అభ్యర్థి రంజిత్‌రెడ్డి చేతిలో ఓటమి. 2021లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆయన 2022 లో భాజపాలో చేరారు.


అభ్యర్థి పేరు: మాధవీలత కొంపెల్ల
నియోజకవర్గం:  హైదరాబాద్‌
స్వస్థలం:   సంతోష్‌నగర్‌, హైదరాబాద్‌
చదువు :  ఎంఏ రాజనీతి శాస్త్రం
కుటుంబం:  భర్త విశ్వనాథ్‌ (ఫౌండర్‌ ఛైర్మన్‌, విరించి ఆసుపత్రి), ఇద్దరబ్బాయిలు, కుమార్తె
వృత్తి :  ట్రస్టీ, లతామా ఫౌండేషన్‌, విశ్వనాథ్‌ ఫౌండేషన్‌, లోపముద్ర ఛారిటబుల్‌ ట్రస్టు
నేపథ్యం: ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. పాత బస్తీతోపాటు ఏపీలోని అనంతపురంలో] సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. బాలికల కోసం ఉచిత జూనియర్‌ కళాశాల నిర్వహిస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలు, మహిళా స్వావలంబనపై అవగాహన కల్పిస్తూ.. సంస్థల ద్వారా నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో తన వాణిని వినిపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని