logo

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళా మహోత్సవాలు

మహిళామణులకు నీరాజనాలు పలుకుతూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో మార్చి 31 వరకు మహిళా మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Updated : 03 Mar 2024 06:37 IST

మార్చి 31 వరకు ప్రత్యేక వేడుకలు

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే : మహిళామణులకు నీరాజనాలు పలుకుతూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో మార్చి 31 వరకు మహిళా మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక వేడుకల్లో భాగంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆనందించేలా వివిధ ప్రత్యేక కార్యక్రమాలు, సరదాసరదా వినోదాలు మిన్నంటుతున్నాయి.

సరికొత్తగా.. : మహిళల కోసమే నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రత్యేకంగా రూపొందించిన స్వాగత కార్యక్రమంతో అద్వితీయ ఆహ్వానం పలుకుతున్నారు. ఆద్యంతం వినోద భరితంగా సాగే కార్యక్రమాలెన్నో అలరిస్తున్నాయి. ఫ్యాషన్‌ షోలో ర్యాంప్‌ వాక్‌ చేసి సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. టాలెంట్‌ హంట్‌లో పాల్గొని ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. సరికొత్తగా రూపొందించిన కార్యక్రమాల్లో భాగంగా కొరియోగ్రాఫర్‌తో సినీ నృత్య వీడియోను రూపొందించేందుకు అవకాశం కల్పించారు. విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు వేదికను ఏర్పాటు చేసి ‘దేవసేన ఆఫ్‌ ది డే’గా ఎంపికయ్యేందుకు అవకాశం ఇచ్చారు. చంద్రముఖి సెట్‌లో సినిమా సన్నివేశాన్ని రక్తి కట్టించేలా నటనా ప్రతిభను చాటేందుకు వీలు కల్పిస్తున్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రాలతో ఫొటో తీసుకొనేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. డీజే మధ్య ప్రత్యేక సాయంత్రపు వినోదాలు అతివలను అలరిస్తున్నాయి.

ప్రత్యేక ఆఫర్‌తో..: మార్చి 31వరకు కొనసాగే మహిళా మహోత్సవాల్లో పాలుపంచుకోవాలనుకొనే అతివలకు ప్రత్యేక ఆఫర్‌ ఇస్తున్నారు. రెండు మహిళల ప్రవేశ టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రూ.500 తగ్గిస్తున్నారు. ఈ ఆఫర్‌ అడ్వాన్స్‌ ఆన్‌లైన్‌ బుకింగ్‌కు మాత్రమే వర్తిస్తుంది.
వివరాలకు.. : ఫోన్‌ నంబర్లు 80086 07026, 76598 76598, 91827 30106, వెబ్‌సైట్‌: www.ramojifilmcity.com లో సంప్రదించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని