logo

మార్చి రాక.. మొదలైన కాక

నగరంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మార్చి రాకతో కాక మొదలైంది. 

Updated : 03 Mar 2024 05:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మార్చి రాకతో కాక మొదలైంది.  శనివారం మోండా మార్కెట్‌లో గరిష్ఠంగా 38.6 డిగ్రీలు, సరూర్‌నగర్‌లో 38.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధిక ప్రాంతాల్లో 35 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉక్కపోత మొదలైంది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతున్నాయి. 24 గంటలు ఫ్యాన్లు, ఏసీలు తిరుగుతుండడంతో నగరంలో విద్యుత్తు డిమాండ్‌ పెరిగింది. 3300 మెగావాట్ల వరకు కరెంట్‌ డిమాండ్‌ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని