logo

ప్రలోభాలకు లొంగొద్దు: రోనాల్డ్‌రాస్‌

రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటేయాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ), జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ పిలుపునిచ్చారు.

Published : 03 Mar 2024 02:22 IST

జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌, డీసీపీ విక్రమ్‌సింగ్‌మాన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటేయాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ), జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోడల్‌ అధికారులతో ఆయన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు చేపట్టాల్సిన పనుల గురించి చర్చించారు. మద్యం నియంత్రణకు ఇప్పట్నుంచే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  ‘‘అన్ని దుకాణాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. రూ.10లక్షలకు పైబడిన నగదు లావాదేవీలపై నిఘా పెట్టండి. గోదాములను జీపీఎస్‌ మ్యాపింగ్‌ చేయండి. జనవరి 1 నుంచి బ్యాంకుల నుంచి నగదును ఎవరెవరు ఎక్కువగా తీసుకున్నారు, యూపీఐ లావాదేవీల వివరాలను బ్యాంకు అధికారులు అందజేయాలి. మత్తు పదార్థాలపై గట్టి నిఘా అవసరం. సంబంధిత అధికారులు చెక్‌పోస్టుల ఏర్పాటుకు సిద్ధమవ్వండి.’’అని రోనాల్డ్‌రాస్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. శాంతిభద్రతల డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ విక్రమ్‌సింగ్‌ మాన్‌ మాట్లాడుతూ.. ‘‘మూడు కమిషనరేట్ల పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయాలి. అవి 24గంటలపాటు పనిచేస్తాయి. రవాణా, ఎక్సైజ్‌, జీఎస్‌టీ, ఇతర శాఖల వారు అందులో ఉంటారు.’’అని తెలిపారు.  ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాష్‌రెడ్డి, ఎన్నికల వ్యయం నోడల్‌ అధికారి శరత్‌ చంద్ర పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని