logo

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగిన ఘటన హస్తినాపురం డివిజన్‌ పరిధి రెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. బాధిత వివాహిత పావని కథనం ప్రకారం..

Updated : 01 Apr 2024 12:04 IST

పావని

కర్మన్‌ఘాట్, న్యూస్‌టుడే: భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగిన ఘటన హస్తినాపురం డివిజన్‌ పరిధి రెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. బాధిత వివాహిత పావని కథనం ప్రకారం.. మిర్యాలగూడ తుమ్మడం గ్రామానికి చెందిన కామేశ్వరి-వెంకట్రెడ్డి దంపతుల కుమార్తె పావని వివాహం 2023 మే 21న ఆర్టీసీ యూనియన్‌ నేత హస్తినాపురం డివిజన్‌ రెడ్డి కాలనీ వాసి రాజిరెడ్డి కుమారుడు కార్తిక్‌ రెడ్డితో జరిగింది. పెళ్లైన నాటి నుంచే భర్త భార్యను సరిగా చూసుకోవడం లేదు. అదనపు కట్నం కోసం వేధింపులకు దిగాడు. కుల పెద్దల సమక్షంలో మాట్లాడినా.. సమస్య పరిష్కారం కాలేదు. తనకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులతో కలిసి యువతి.. మూడు రోజులుగా రాజిరెడ్డి నివాసం వద్ద ఆందోళన చేస్తోంది. కుల పెద్దలు, మధ్యవర్తుల సూచనతో ఆదివారం ఆందోళన విరమించింది. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ.. తనకు న్యాయం జరగకపోతే, మళ్లీ ఆందోళనకు దిగుతానన్నారు. ఆర్టీసీ యూనియన్‌ ప్రతినిధి రాజిరెడ్డి మాట్లాడుతూ.. చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని