logo

‘ధన్వంతరి ఫౌండేషన్‌’ బాధితులకు న్యాయం చేయాలి

‘ధన్వంతరి ఫౌండేషన్‌’ పేరిట బ్రాహ్మణులకు తక్కువ ధరకు ప్లాట్లు ఇస్తామని, విశ్వవిద్యాలయం, ఆసుపత్రి, అగ్రహారం ఏర్పాటు చేస్తామని నమ్మించి రూ.350-500 కోట్లు వసూలు చేసి మోసం చేసిన కేసును సీఐడీకి అప్పగించాలని  పలు సంస్థల ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Published : 03 Apr 2024 02:20 IST

నినాదాలు చేస్తున్న బాధితులు

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: ‘ధన్వంతరి ఫౌండేషన్‌’ పేరిట బ్రాహ్మణులకు తక్కువ ధరకు ప్లాట్లు ఇస్తామని, విశ్వవిద్యాలయం, ఆసుపత్రి, అగ్రహారం ఏర్పాటు చేస్తామని నమ్మించి రూ.350-500 కోట్లు వసూలు చేసి మోసం చేసిన కేసును సీఐడీకి అప్పగించాలని పలు సంస్థల ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫౌండేషన్‌ ఖాతాలను స్తంభింప చేయాలని, స్థలాలను స్వాధీనం చేసుకోవాలని కోరారు. బాధితులకు న్యాయం చేసేందుకు పోరాట కమిటీని ఏర్పాటు చేశారు. మంగళవారం బర్కత్‌పురలోని బ్రాహ్మణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో భారత్‌ సేవా సహకార్‌ సంస్థ ఛైర్మన్‌ బస్వరాజు శ్రీనివాస్‌, సీనియర్‌ పాత్రికేయులు వెంకటరమణ శర్మ, విశ్రాంత అదనపు కలెక్టర్‌ సురేశ్‌ పొద్దార్‌, బ్రాహ్మణ సంఘ నేత గిరిప్రసాద్‌ శర్మ మాట్లాడారు. ‘ధన్వంతరి ఫౌండేషన్‌’ పేరిట పంతంగి కమలాకర్‌ శర్మ బ్రాహ్మణుల వద్ద భారీ మొత్తం వసూలు చేసి సొంత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. ఎక్కువ వడ్డీ ఇస్తామనీ మోసం చేశారన్నారు. సీసీఎస్‌లో కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, ఇది అగ్రిగోల్డ్‌కు మించిన పెద్ద కుంభకోణమని వివరించారు. మంత్రి డి.శ్రీధర్‌బాబును కలిసి వివరించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని