logo

మేడ్చల్‌ జిల్లాలో మెగాలిథిక్‌ సమాధులు

మేడ్చల్‌ జిల్లాలో మూడుచింతలపల్లి మండలం అద్రస్‌పల్లిలో పాతరాతి యుగం (మెగాలిథిక్‌) సమాధులను కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు అహోబిలం కరుణాకర్‌, మహ్మద్‌ ససీరుద్దీన్‌, కొరివి గోపాల్‌ గుర్తించారు.

Published : 03 Apr 2024 02:22 IST

మెన్హర్లను చూపుతున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు

ఈనాడు, హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లాలో మూడుచింతలపల్లి మండలం అద్రస్‌పల్లిలో పాతరాతి యుగం (మెగాలిథిక్‌) సమాధులను కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు అహోబిలం కరుణాకర్‌, మహ్మద్‌ ససీరుద్దీన్‌, కొరివి గోపాల్‌ గుర్తించారు. ఒక మెగాలిథిక్‌ సమాధికి 18 బంతిరాళ్లు గుండ్రంగా పాతిఉండగా మధ్యలో సమాధికి సంబంధించిన పలకరాళ్లు(ఆర్ధోస్టాట్స్‌) పైకి కనిపిస్తున్నాయని, ఇది సిస్టుబరియల్‌(పెట్టెసమాధి) అని గుర్తించారు. పరిసరాల్లో ఉన్న మెన్హర్లు(నిలువురాళ్లు) 12-14 అడుగుల ఎత్తున్నాయని చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ అన్నారు. తెలంగాణలో కనీసం పది లక్షల బృహత్‌ శిలాయుగపు సమాధులుండి ఉంటాయని అప్పటి హైదరాబాద్‌ ఆర్కియలాజికల్‌ సొసైటీ సభ్యుడు, యూరోపియన్‌ పరిశోధకుడు ఈహెచ్‌ హంట్‌ 1925లో రాసిన గ్రంథంలో పేర్కొన్నాడని తెలిపారు. ఇప్పటివరకు మేడ్చల్‌ జిల్లాలో జరిపిన అన్వేషణలో పలు ప్రాంతాల్లో రాతి చిత్రాలు, పెట్రోగ్లైప్స్‌, పాతరాతియుగం సమాధులు, రాతి పనిముట్లను గుర్తించినట్టు బృందం వెల్లడించింది. మన పూర్వీకుల జీవన శైలి తెలిస్తే మన చరిత్ర సంపూర్ణం అవుతుందని, వాటిని పరిశీలించి, పరిశోధించడానికి సమాధులను రక్షించాలని తెలంగాణ వారసత్వశాఖకు, ప్రభుత్వానికి ఆ బృందం నివేదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని