logo

రూ. 26 వేల కోట్లతో రీజినల్‌ రింగ్‌రోడ్‌

రూ. 26 వేల కోట్ల వ్యయంతో రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ట్రిపుల్‌ ఆర్‌)నిర్మాణానికి కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు.

Published : 03 Apr 2024 02:24 IST

మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, చిత్రంలో గౌతంరావు తదితరులు

అంబర్‌పేట, న్యూస్‌టుడే: రూ. 26 వేల కోట్ల వ్యయంతో రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ట్రిపుల్‌ ఆర్‌)నిర్మాణానికి కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ట్రిపుల్‌ ఆర్‌ నిర్మాణం పూర్తయితే అనేక పరిశ్రమలు వస్తాయని వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. మంగళవారం అంబర్‌పేటలో భాజపా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను రూ.760 కోట్లతో ఎయిర్‌పోర్ట్‌ తరహాలో తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. కాచిగూడ, నాంపల్లి  స్టేషన్లనూ ఆధునికీకరిస్తున్నామన్నారు. పార్టీ నేతలు నాగభూషణంచారి, ఆనంద్‌గౌడ్‌, భిక్షపతి, యశ్వంత్‌, నవీన్‌రెడ్డి, కృష్ణముదిరాజ్‌, యాదగిరి, మైలారం రాజు, వెంకటస్వామిగౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని