logo

ఆయుష్మాన్‌ భారత్‌తో పేదలకు కార్పొరేట్‌ వైద్యం

కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేదలకు ఉచితంగా రూ.5లక్షల కార్పొరేట్‌ వైద్యాన్ని అందిస్తున్నారని చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండావిశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

Published : 03 Apr 2024 02:25 IST

దోశ వేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేదలకు ఉచితంగా రూ.5లక్షల కార్పొరేట్‌ వైద్యాన్ని అందిస్తున్నారని చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండావిశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. తాండూరు మండలం కరణ్‌కోట, మల్కాపూర్‌, కోటబాస్పల్లి, ఐనెల్లి, జిన్‌గుర్తి, గౌతాపూర్‌, చెంగోల్‌, గుండ్లమడుగుతండాలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్ర సభల్లో ఆయన ప్రసంగించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భాజపాను మరోసారి ఆదరించాలని కోరారు. కొత్లాపూర్‌లో రేణుకా ఎల్లమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేయగా అర్చకులు శ్రీనివాస్‌ తీర్థప్రసాదాలు అందజేశారు. దారిలో హోటల్‌ వద్దకు వెళ్లి స్వయంగా దోశ వేసి స్థానికులకు అందించారు. భాజపా ముఖ్య నాయకులు యు.రమేష్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహు శ్రీలత, శేఖాపురం ఆంజనేయులు, నాగారం మల్లేషం, అంతారం లలిత, రజనీకాంత్‌, కృష్ణముదిరాజ్‌, భద్రేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతుల మేలు కోరే నిర్ణయాలు తీసుకుంటాం

తాండూరు: కేంద్రంలో భాజపా అధికారంలోకి రాగానే కంది, టమాట రైతుల మేలు కోరే నిర్ణయాలు తీసుకుంటామని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. తాండూరులో మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఎప్పుడు వచ్చినా కలుస్తాను. సమస్యలను విని పరిష్కరిస్తాను తప్ప అపాయింట్‌ మెంట్‌ ఇవ్వనని భారాస, కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ నేరమేనన్నారు.

ఇక మీద ధోతి, లాల్చీనే ధరిస్తా

ఎపుడూ ప్యాంటు చొక్కాతో కనిపించే కొండా విశ్వేశ్వరరెడ్డి మంగళవారం ధోతి, లాల్చీతో కొత్త ఆహార్యంతో కనిపించారు. ఇవెంతో సౌకర్యవంతంగా ఉన్నాయని, ఇక మీదట వీటినేే ధరిస్తానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని