logo

సైబర్‌ వారియర్లకు ప్రత్యేక నంబర్లతో ఫోన్లు

సైబర్‌ నేరం జరిగాక ఎవరికి.. ఎక్కడ, ఎలా.. ఫిర్యాదు చేయాలని తర్జనభర్జన పడే బాధితులకు అండగా నిలిచేందుకు సైబరాబాద్‌ పోలీసులు మరో ముందడుగు వేశారు.

Updated : 03 Apr 2024 06:05 IST

సైబర్‌ వారియర్లతో డీసీపీ నర్సింహ, ఇతర సిబ్బంది

ఈనాడు- హైదరాబాద్‌: సైబర్‌ నేరం జరిగాక ఎవరికి.. ఎక్కడ, ఎలా.. ఫిర్యాదు చేయాలని తర్జనభర్జన పడే బాధితులకు అండగా నిలిచేందుకు సైబరాబాద్‌ పోలీసులు మరో ముందడుగు వేశారు. కమిషనరేట్‌ పరిధిలో శాంతి భద్రతల ఠాణాలో ఉండే సైబర్‌ వారియర్లకు ప్రత్యేక ఫోన్లు, శాశ్వత నంబరుతో సిమ్‌కార్డులు అందించారు. సైబర్‌  బాధితులకు ఫిర్యాదు చేయడంలో సహకరించడం, కేసు స్థితిని తెలియజేయడం లక్ష్యంగా ఈ ఫోన్లు ఇచ్చారు. ప్రతి ఠాణాలో ఇద్దరు సైబర్‌ వారియర్లు ఉంటారు. వీరందరికీ మంగళవారం సైబరాబాద్‌ కమిషనరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సైబర్‌ క్రైం డీసీపీ కొత్తపల్లి నర్సింహ.. ఫోన్లు అందించారు. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) సహకారంతో ఈ ఫోన్లు అందించారు. సైబర్‌ నేరాలు వెల్లువలా నమోదవుతున్న నేపథ్యంలో బాధితులకు సహకారం అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని డీసీపీ పేర్కొన్నారు. 

  • సైబర్‌ బాధితులు కాల్‌ చేసినప్పుడు సైబర్‌ వారియర్లు బాధ్యతతో మాట్లాడుతూ.. ఫిర్యాదు ఎలా చేయాలో వివరించాలి.
  • కేసు పురోగతి తెలుసుకునేందుకు బాధితులు 1930 కాల్‌ సెంటర్‌కు చేసిన కాల్స్‌ను సైబర్‌ వారియర్లకు మళ్లిస్తారు. ఇలాంటివారికి తగిన సమాచారం ఇవ్వాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని