logo

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్‌ పాలన

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే తుక్కుగూడలో విడుదల చేసిన ఆరు గ్యారంటీల మ్యాని ఫెస్టో ప్రజలను ఆకట్టుకుందని.. దీంతో ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించారని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

Updated : 03 Apr 2024 03:23 IST

జన జాతర సభ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు,
కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, మేయర్‌ పారిజాత , డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి

మహేశ్వరం, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే తుక్కుగూడలో విడుదల చేసిన ఆరు గ్యారంటీల మ్యాని ఫెస్టో ప్రజలను ఆకట్టుకుందని.. దీంతో ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించారని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈనెల 6న తుక్కుగూడలో ఈ-సిటీ వద్ద నిర్వహించనున్న జనజాతర బహిరంగ సభ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మధుయాస్కీగౌడ్‌, ఇతర నేతలతో కలిసి మంగళవారం పరిశీలించారు. వేదిక, వీఐపీ గ్యాలరీలు, సభకు వచ్చే జనాలకు సదుపాయాలపై చర్చించారు. అనంతరం తుక్కుగూడలో  మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం అని తెలిపారు. జన జాతర బహిరంగ సభకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక  రానున్నారని తెలిపారు. కార్యకర్తలు, ప్రజలు,  మహిళలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ గ్యారంటీలను మోదీ ప్రభుత్వం కాపీ కొట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.  డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి మల్లురవి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మేయర్‌ పారిజాత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎంపీపీ సునీత  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని