logo

కుమారుడు ప్రయోజకుడు కాలేదని పదో అంతస్తు పైనుంచి దూకి తండ్రి ఆత్మహత్య

కుమార్తె మానసిక వికలాంగురాలు, కుమారుడు ప్రయోజకుడు కాలేదని మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం అత్తాపూర్‌ ఠాణా పరిధిలోని ఉప్పర్‌పల్లిలో జరిగింది.

Updated : 12 Apr 2024 08:32 IST

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: కుమార్తె మానసిక వికలాంగురాలు, కుమారుడు ప్రయోజకుడు కాలేదని మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం అత్తాపూర్‌ ఠాణా పరిధిలోని ఉప్పర్‌పల్లిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... బేగంబజార్‌కు చెందిన దేవిదాస్‌ అగర్వాల్‌(50) మూడేళ్ల కిందట రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప్పర్‌పల్లికి వచ్చి కుటుంబంతో ఉంటున్నాడు. ఎల్‌ఐసీ ఏజెంట్‌గా చేస్తున్నాడు. కుమార్తె మానసికంగా ఎదగలేదు. కుమారుడు మహాదేవ్‌కు ఇటీవల పెళ్లి చేయగా కిషన్‌బాగ్‌లో ఉంటూ.. క్యాబ్‌డ్రైవర్‌గా చేస్తున్నాడు. అతను ఇటీవల వాహనం తెచ్చుకుంటానంటే తండ్రి డబ్బులు ఇవ్వగా వాటిని దుర్వినియోగం చేశాడు. దీంతో తండ్రి ఆవేదన చెందాడు. ఇదే విషయంలో కుటుంబ సభ్యులతో కొన్ని రోజులుగా వివాదం జరుగుతోంది. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఉప్పర్‌పల్లి ప్రధాన రహదారిపై ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి అక్కడ కాపలదారుడిని అద్దెకు పోర్షన్‌ కావాలని అడిగాడు. అతడు పదో అంతస్తులో ఉందని చెప్పడంతో లిఫ్ట్‌లో అక్కడికి వెళ్లిన దేవిదాస్‌ అగర్వాల్‌ అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని