logo

నాణ్యమైన భోజనం అందించడంలో అక్షయపాత్ర కృషి భేష్‌

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో అక్షయపాత్ర చేస్తున్న కృషి ప్రశంసనీయమని జెమినీ ఎడిబుల్స్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ పి.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.

Published : 16 Apr 2024 05:49 IST

నార్సింగి, న్యూస్‌టుడే: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో అక్షయపాత్ర చేస్తున్న కృషి ప్రశంసనీయమని జెమినీ ఎడిబుల్స్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ పి.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సీఎస్సార్‌ కార్యక్రమంలో భాగంగా జెమినీ ఎడిబుల్స్‌ సంస్థ రూ.రెండు కోట్ల వ్యయంతో అక్షయపాత్ర వంటశాల సామర్థ్యం పెంచడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు సిద్ధం చేసిన ఆహారాన్ని రవాణా చేయడానికి 3 ఈవీ వాహనాలను సమకూర్చింది. వీటిని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో అనేక ప్రాంతాలలో విద్యార్థులకు భోజనం అందిస్తున్న అక్షయపాత్ర సంస్థ ఇటీవల 400 కోట్ల భోజనాలు అందించిన ఘనత సాధించడం అభినందనీయమన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్‌ ప్రాంతీయ అధ్యక్షుడు, ట్రస్టీ సత్యగౌర చంద్రదాస మాట్లాడుతూ.. నార్సింగి వంటశాలలో ప్రస్తుతం ఉన్న 35 వేల మందికి వంట తయారీ సామార్థ్యాన్ని 50వేలకు పెంచడానికి అవసరమైన సదుపాయాలను కల్పించడానికి జెమినీ ఎడిబుల్స్‌ ముందుకు రావడం అభినందనీయమన్నారు.  జెమినీ ఎడిబుల్స్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ అధికారి రాజేష్‌ అగర్వాల్‌, అక్షయపాత్ర సీఈవో శ్రీధర్‌ వెంకట్‌  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని