logo

రేషన్‌ బియ్యం కొని ఎఫ్‌సీఐకి తరలింపు

500 టన్నుల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. బీడీఎల్‌ ఠాణా పరిధిలోని ఘటన వివరాలు సంగారెడ్డి ఎస్పీ రూపేష్‌కుమార్‌ తెలిపారు.

Published : 16 Apr 2024 05:57 IST

500 టన్నుల బియ్యం స్వాధీనం'

వివరిస్తున్న ఎస్పీ రూపేష్‌కుమార్‌

పటాన్‌చెరు: 500 టన్నుల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. బీడీఎల్‌ ఠాణా పరిధిలోని ఘటన వివరాలు సంగారెడ్డి ఎస్పీ రూపేష్‌కుమార్‌ తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి రైస్‌మిల్లు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వం ఇతని మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐ గోదాంకు పంపుతున్నాడు. ఇదే అదనుగా రాష్ట్రం నలుమూలల నుంచి తక్కువ ధరకు రేషన్‌ బియ్యాన్ని కొనుగోలుచేసి వాటినే ఎఫ్‌సీఐకి పంపడం మొదలెట్టాడు. పౌరసరఫరాలశాఖ ఇచ్చిన ధాన్యాన్ని ఆడించగా వచ్చిన బియ్యాన్ని ఎక్కువ ధరలకు అమ్ముకొన్నాడు.పాశమైలారం పారిశ్రామికవాడలో స్థలం అద్దెకు తీసుకుని అనుమతి లేకుండా రైస్‌మిల్లు ఏర్పాటుచేశాడు. రేషన్‌బియ్యాన్ని ఇక్కడికి పంపి శుభ్రం చేయించేందుకు రవిని నియమించుకున్నాడు. రక్షణగా 15మంది బిహార్‌ వ్యక్తులను నియమించాడు. బియ్యాన్ని సంచుల్లో నింపి వినాయక ట్రేడర్స్‌ పేరిట ఎఫ్‌సీఐ ముద్ర వేసి ఆదిలాబాద్‌కు తరలిస్తున్నాడు. అధికారులు రవిని అదుపులోకి తీసుకున్నారు.ప్రభాకర్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. విలేకర్ల సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వనజారెడ్డి, విజిలెన్స్‌ ఎస్పీ శశిధర్‌రాజు తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని