logo

నిర్మాణ వ్యర్థాలా.. మేమే తీసుకెళ్తాం

ఇంటి నిర్మాణం, మరమ్మతు, కూల్చివేత సందర్భంగా ఉత్పత్తయ్యే వ్యర్థాలను మేమే తీసుకెళ్తామని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌, ‘మైజీహెచ్‌ఎంసీ’ మొబైల్‌ యాప్‌లో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు.

Updated : 16 Apr 2024 06:29 IST

నిర్ణీత రుసుముతో వెబ్‌సైట్‌, మొబైల్‌యాప్‌ సేవలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటి నిర్మాణం, మరమ్మతు, కూల్చివేత సందర్భంగా ఉత్పత్తయ్యే వ్యర్థాలను మేమే తీసుకెళ్తామని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌, ‘మైజీహెచ్‌ఎంసీ’ మొబైల్‌ యాప్‌లో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు. రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో, చెరువుల్లో వ్యర్థాలు వేస్తున్న ప్రైవేటు వాహనదారులకు జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు.

సేవలు పొందండిలా..

https://igs.ghmc.gov.in/CNDWaste_Send_OtpMobile.aspx  వెబ్‌లింకులో ఫోన్‌ నంబరుతో నమోదై సేవలను పొందవచ్చు.

  • ‘మైజీహెచ్‌ఎంసీ’ మొబైల్‌ యాప్‌లో ‘కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెమోలిషన్‌ వేస్ట్‌’ పేరుతో ఉండే లింకుతో సేవలను పొందొచ్చు.
  • వ్యర్థాలను ఇంటికొచ్చి తీసుకెళ్తే.. టన్ను వ్యర్థాలకు రూ.388.75 నుంచి రూ.435 చొప్పున , నిర్మాణదారు లేదా భవన యజమాని సొంత వాహనాలతో డంపింగ్‌యార్డులకు వ్యర్థాలను తరలిస్తే టన్నుకు రూ.97.2 నుంచి రూ.108.75 చొప్పున నిర్వహణ రుసుము వసూలు చేస్తారు.

సర్కిళ్లవారీగా నంబర్లు..

  • టోల్‌ఫ్రీ 1800-120-1159, వాట్సప్‌ 91009 27073
  • ఉప్పల్‌, హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌, మలక్‌పేట, సంతోష్‌నగర్‌, అంబర్‌పేట, యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, చందానగర్‌, ఆర్‌సీపురం-పటాన్‌చెరు, మూసాపేట, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, గాజులరామారం.
  • టోల్‌ఫ్రీ 1800-203-0033, వాట్సాప్‌ 73300 00203
  • చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్‌, మెహిదీపట్నం, కార్వాన్‌, గోషామహల్‌, జూబ్లీహిల్స్‌, కాప్రా, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌, అల్వాల్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, బేగంపేట.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని