logo

నోడల్‌ అధికారులు బాధ్యతగా పనిచేయాలి

పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్‌ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్‌ రాస్‌ ఆదేశించారు.

Published : 19 Apr 2024 02:55 IST

ఎన్నికల ఏర్పాట్ల సమీక్షలో డీఈవో రోనాల్డ్‌రాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్‌ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్‌ రాస్‌ ఆదేశించారు. మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ(ఎంసీఎంసీ), ఎన్నికల నియమావళి, వ్యయ పర్యవేక్షణ, ప్రచార కార్యక్రమాలు, ఉద్యోగులతో పని చేయించడం, ఎన్నికల వస్తువులను సమకూర్చుకోవడం, దివ్యాంగులకు వసతులు, ఇతరత్రా విభాగాల నోడల్‌ అధికారులతో ఆయన గురువారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సీ-విజిల్‌, ఎస్‌ఎంఎస్‌ మానిటరింగ్‌ సెల్‌, క్యూ మేనేజ్‌మెంట్‌, ఓటరు శాతం తదితర యాప్‌లను మెరుగ్గా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. తపాలా ఓటు బ్యాలెట్‌ పేపరును జాగ్రత్తగా ముద్రించాలని, ఫారం-12 ఆమోదం పొందిన ఉద్యోగులంతా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాష్‌రెడ్డి, ఎన్నికల విభాగం అదనపు కమిషనర్‌ అలివేలు మంగతాయారు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని