logo

ఒలింపిక్స్‌లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు

ప్రపంచ నంబరు వన్‌ బ్యాడ్మింటన్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ ఒలింపిక్స్‌లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్‌ఎన్‌సీసీ స్పోర్ట్స్‌ కమిటీ ఛైర్మన్‌ చాముండేశ్వరినాథ్‌ ప్రకటించారు.

Published : 20 Apr 2024 06:55 IST

సాయిరాజ్‌ను అభినందిస్తున్న చాముండేశ్వరినాథ్‌. చిత్రంలో నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, జి.ఆదిశేషగిరిరావు

ఫిల్మ్‌నగర్‌, న్యూస్‌టుడే: ప్రపంచ నంబరు వన్‌ బ్యాడ్మింటన్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ ఒలింపిక్స్‌లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్‌ఎన్‌సీసీ స్పోర్ట్స్‌ కమిటీ ఛైర్మన్‌ చాముండేశ్వరినాథ్‌ ప్రకటించారు. ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో శుక్రవారం ఆల్‌ ఇండియా మెన్స్‌ అండ్‌ ఉమెన్స్‌ టోర్నమెంట్‌ ముగింపు సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎన్‌సీసీ)లో టోర్నమెంట్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి పోటీలు క్రీడాకారులకు ఎంతో ఉత్సాహానిస్తాయన్నారు. ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు జి.ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. దేశంలో కొవిడ్‌ తరువాత రూ.10లక్షల బహుమతితో ఇప్పటి వరకు ఒక్క టోర్నమెంట్‌ జరగలేదని గుర్తు చేశారు. ఎఫ్‌ఎన్‌సీసీ కార్యదర్శి ముళ్లపుడి మోహన్‌, ఫిల్మ్‌నగర్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ కార్యదర్శి కాజ సూర్యనారాయణ పాల్గొన్నారు. ః ఎఫ్‌ఎన్‌సీసీ టెన్నిస్‌ టోర్నీలో తెలంగాణ అమ్మాయి అభయ వేమూరి రన్నరప్‌గా నిలిచింది. సింగిల్స్‌ ఫైనల్‌లో అభయ 4-6, 3-6 తేడాతో ఆరో సీడ్‌ ఆకాంక్ష (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయింది. డబుల్స్‌లో ఆకాంక్ష - యుబ్రాని (పశ్చిమ బెంగాల్‌) జంట 4-6, 6-4, 10-4తో మేధాని - ఆయూషీ (బిహార్‌) జోడీపై నెగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని