logo

‘రేవంత్‌ను ముట్టుకుంటే మసైపోతారు’

భారాస నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని దిగిపోవాలంటున్నారని, ఆయన త్రీ ఫేజ్‌ కరెంట్‌ తీగలాంటి వాడని, ఎవరైనా ముట్టుకుంటే మసైపోతారని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ హెచ్చరించారు.

Published : 21 Apr 2024 02:28 IST

యూసుఫ్‌గూడ, న్యూస్‌టుడే: భారాస నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని దిగిపోవాలంటున్నారని, ఆయన త్రీ ఫేజ్‌ కరెంట్‌ తీగలాంటి వాడని, ఎవరైనా ముట్టుకుంటే మసైపోతారని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశాన్ని వి.నవీన్‌యాదవ్‌ ఆధ్వర్యంలో శనివారం మహమూద్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన దానం నాగేందర్‌ మాట్లాడుతూ  కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ శాసనసభ నియోజకవర్గానికి రూ.100 కోట్ల నిధులు కూడా తేలేదని విమర్శించారు. భారాస పదేళ్ల పాలనలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో రౌడీయిజాన్ని పోషించారని, ఇతర పార్టీ నాయకులను కేసుల పేరిట వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ  కాంగ్రెస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఓటర్ల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బూత్‌స్థాయి కార్యకర్తలపై ఉందన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌, నాయకులు చిన్న శ్రీశైలంయాదవ్‌, ఉపేందర్‌రెడ్డి, భవానీశంకర్‌, మురళీగౌడ్‌, అసదుద్దీన్‌, కార్పొరేటర్లు బాబా ఫసీయుద్దీన్‌, సీ.ఎన్‌.రెడ్డి, సంగీతాయాదవ్‌, మైనార్టీ నాయకులు ఖురేషీ, షరీప్‌, ఫెరోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని