logo

‘బీఎండబ్ల్యూ’కు జరిమానా

రక్షణ ప్రమాణాలు పాటించకుండా తయారు చేసిన వాహనాలు అంటగట్టిన బీఎండబ్ల్యూ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌కు హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-1 జరిమానా విధించింది.

Published : 21 Apr 2024 02:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: రక్షణ ప్రమాణాలు పాటించకుండా తయారు చేసిన వాహనాలు అంటగట్టిన బీఎండబ్ల్యూ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌కు హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-1 జరిమానా విధించింది. ఫిర్యాదీకి రూ.1,00,000 పరిహారం, కేసు ఖర్చులు రూ.25 వేలు ఇవ్వాలని ఆదేశించింది. యూసుఫ్‌గూడకు చెందిన సైబర్‌హ్యాట్‌ సొల్యూషన్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ సీఈవో శ్రీరామ్‌ సింహతేజ బీఎండబ్ల్యూ వాహనాల రక్షణ ప్రమాణాలపై ఆ సంస్థ వెబ్‌సైట్‌లో పరిశీలించి ‘బీఎండబ్ల్యూ 3 సిరీస్‌ కారును కొనుగోలు చేశారు. 2022 మార్చి 3న తమిళనాడులోని తంజావూరు తాలూకాలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోకపోవడం, విండ్‌షీల్డ్స్‌ పగిలిపోయి ఆ గాజుముక్కలు ముందు ఇద్దరు ప్రయాణికులకు గుచ్చుకున్నాయి. వారు తీవ్రంగా గాయపడ్డారు.  విచారణలో భాగంగా కారులో ఎయిర్‌బ్యాగులు అమర్చలేదని పోలీసులు గుర్తించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఫిర్యాదీ సదరు సంస్థకు లేఖ రాశారు. దీనిపై బీఎండబ్ల్యూ తయారీదారులు సరైన వివరణ ఇవ్వకపోవడంతో ఫిర్యాదీ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని