logo

రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దు: సీపీ

హనుమాన్‌ జయంతి సందర్భంగా విజయయాత్రలో రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు, బ్యానర్లు ప్రదర్శించవద్దని నగర కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాప్తి చేయొద్దన్నారు.

Published : 21 Apr 2024 02:30 IST

ఈనాడు, హైదరాబాద్‌: హనుమాన్‌ జయంతి సందర్భంగా విజయయాత్రలో రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు, బ్యానర్లు ప్రదర్శించవద్దని నగర కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాప్తి చేయొద్దన్నారు. ర్యాలీలో రాజకీయ చిహ్నాలు, ప్రసంగాలు అనుమతించబోమన్నారు. ఈనెల 23న ‘వీర హనుమాన్‌ విజయయాత్ర’ ఏర్పాట్లపై బల్దియా, విద్యుత్తు, ఆర్‌అండ్‌బీ, ఆర్టీసీ, జలమండలి తదితర శాఖల అధికారులు, బజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీ నేతలతో బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌ కార్యాలయంలో కమిషనర్‌ సమావేశం నిర్వహించారు. ఊరేగింపు జరిగే 12.2 కి.మీ. మార్గాన్ని పరిశీలించారు. ఎన్నికల దృష్ట్యా ఈసీ నిబంధనలు  ఉల్లంఘించకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 23న బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో సంయుక్త కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదనపు కమిషనర్‌ విక్రమ్‌సింగ్‌ మాన్‌, డీసీపీలు గిరిధర్‌, జానకి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని