logo

ఓలా క్యాబ్స్‌కు మొట్టికాయలు

ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్‌పై చర్యలు తీసుకోకపోవడంతోపాటు ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేసిన ‘ఓలా క్యాబ్స్‌’కు హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-3 మొట్టికాయలు వేసింది.

Published : 21 Apr 2024 02:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్‌పై చర్యలు తీసుకోకపోవడంతోపాటు ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేసిన ‘ఓలా క్యాబ్స్‌’కు హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-3 మొట్టికాయలు వేసింది. అనైతిక వ్యాపారానికి పాల్పడినందుకు రూ.లక్ష జరిమానా, రూ.5 వేలు కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. ప్రయాణికుల నుంచి వసూలు చేసిన రూ.861కి  12 శాతం వడ్డీ కలిపి మొత్తం డబ్బును 45 రోజుల్లో ఇవ్వాలంది. అబిడ్స్‌కు చెందిన జాబేజ్‌ సామ్యూల్‌ కొన్నేళ్లుగా ప్రతివాద సంస్థ యాప్‌ను వినియోగిస్తున్నారు. నిరంతరం తిరిగే ప్రయాణికుడు కావడంతో క్రెడిట్‌ లిమిట్‌, పే లెటర్‌ సదుపాయాన్ని కల్పించారు. ఫిర్యాదీ, తన భార్య, సహాయకురాలు కలిసి 2021 అక్టోబర్‌ 19న క్యాబ్‌ బుక్‌ చేశారు. కారులో శుభ్రత పాటించలేదు.దుర్గంధం వస్తుండడంతో ఏసీ వేయాలని కోరారు. డ్రైవర్‌ దురుసుగా ప్రవర్తించి దింపేశాడు.అప్పటికే 5కి.మీ.ప్రయాణించగా రూ.861 బిల్లు వచ్చింది. అవాక్కయిన ఫిర్యాదీ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించినా లాభం లేకపోయింది. దీంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని