logo

పారదర్శక ఎన్నికలు అవసరం

పార్లమెంట్‌ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించడానికి నోడల్‌ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యయ పరిశీలకుడు, ఐఆర్‌ఎస్‌ అధికారి రాజీవ్‌ చౌరా అన్నారు.

Published : 21 Apr 2024 02:37 IST

రాజీవ్‌ చౌరాకు వివరిస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

వికారాబాద్‌, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించడానికి నోడల్‌ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యయ పరిశీలకుడు, ఐఆర్‌ఎస్‌ అధికారి రాజీవ్‌ చౌరా అన్నారు. జిల్లా వ్యయ పరిశీలకునిగా నియమితులైన ఆయన కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చులను ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు నమోదు చేయాలని తెలిపారు.

అనుమానాస్పద ఖాతాల తనిఖీ..

అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో చేసే ఖర్చులను ఏ విధంగా లెక్కిస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన అన్ని బృందాలు సమన్వయంతో విధులు నిర్వహించాలని, అనుమానాస్పద ఖాతాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రచారానికి పార్టీ ద్వారా అభ్యర్థి తరపున ఖర్చు చేసే ప్రతి పైసాను ఎన్నికల వ్యయం కింద చూపించాలని అన్నారు.

సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక దృష్టి

ఎన్నికల వేళ సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విధులు నిర్వహించే అధికారులు ప్రతి అంశంపై నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లు, ఓటరు జాబితా, ఎఫ్‌ఎస్‌టీ, వీఎస్‌టీ, వీవీటీ, ఎస్‌ఎస్‌టీ బృందాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కలెక్టర్‌ నారాయణరెడ్డి వివరించారు. అనంతరం సి-విజిల్‌ యాప్‌, టోల్‌ఫ్రీ నంబర్‌ 1950, కాల్‌ సెంటర్‌, గ్రీవెన్స్‌ కమిటీ, మీడియా సెంటర్‌, కంట్రోల్‌ రూం తదితర ఎన్నికల విభాగాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్పీ కోటిరెడ్డి,  అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, లింగ్యానాయక్‌, శిక్షణ సహాయ కలెక్టర్‌ ఉమాహారతి, వికారాబాద్‌, తాండూర్‌ ఆర్డీఓలు వాసుచంద్ర, శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ సుధీర్‌, డీఆర్‌డీఏ శ్రీనివాస్‌, ఎన్నికల బృందాల నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని