logo

రాజనీతిజ్ఞుడు చంద్రబాబునాయుడు: బక్కని నర్సింహులు

ఎన్నికల కోసం కాకుండా భావితరాల భవిష్యత్తుకు ప్రణాళికలు రచించి అమలు చేసే రాజనీతిజ్ఞుడు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు.

Published : 21 Apr 2024 02:39 IST

పార్టీ కార్యాలయంలో బక్కని నర్సింహులు, నన్నూరి నర్సిరెడ్డి,  ఎన్టీఆర్‌ విద్యా సంస్థల్లో రామారావు, వెంకటేశ్వర్లు తదితరులు

బంజారాహిల్స్‌, మొయినాబాద్‌, న్యూస్‌టుడే: ఎన్నికల కోసం కాకుండా భావితరాల భవిష్యత్తుకు ప్రణాళికలు రచించి అమలు చేసే రాజనీతిజ్ఞుడు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు. చంద్రబాబు 74వ పుట్టినరోజు వేడుకలు శనివారం బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించారు. తెదేపా క్రమశిక్షణా కమిటీ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబునాయుడు పుట్టిన రోజును శనివారం మొయినాబాద్‌ మండలం హిమాయత్‌ నగర్‌లోని ఎన్టీఆర్‌ కుటీరం ఆవరణలో కొనసాగుతున్న ఎన్టీఆర్‌ విద్యా సంస్థల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో భారీ కేక్‌ను విద్యాసంస్థల డీన్‌ డాక్టర్‌ రామారావు, డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు కట్‌ చేసి సంబురాలు చేశారు. ఏవో సురేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని