logo

ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు: కొండా

ధనిక రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు చేస్తే కొత్త ప్రభుత్వం మోసం చేసి అధికారంలోకి వచ్చిందని భాజపా చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఫంక్షన్‌ హాల్‌లో సమావేశం నిర్వహించారు.

Published : 21 Apr 2024 03:19 IST

మాట్లాడుతున్న భాజపా ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి

ధారూర్‌, న్యూస్‌టుడే: ధనిక రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు చేస్తే కొత్త ప్రభుత్వం మోసం చేసి అధికారంలోకి వచ్చిందని భాజపా చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఫంక్షన్‌ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల పాలు అయితే ఆదుకున్నది మోదీనే అన్నారు. ఆరు గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పింఛన్లు పెంచుతామని వచ్చే పింఛన్లు కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రెండు పైసలు కూడా చేయలేదన్నారు. ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలను తెరిపించి బ్యాంకు సేవలను అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి మోదీ అన్నారు. కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. అనంతరం మండల పరిధిలోని మోమిన్‌కలాన్‌, పీసీయం తండా, ధారూర్‌ స్ట్టేషన్‌, అల్లాపూర్‌ గ్రామాలకు చెందిన పలువురు నాయకులు పార్టీలో చేరారు. వారికి విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, ఉపాధ్యక్షులు వివేకానందరెడ్డి, మండల అధ్యక్షులు రమేష్‌, నాయకులు పాండుగౌడ్‌, వడ్ల నందు, రాజేందర్‌ గౌడ్‌, రాజునాయక్‌, ఆనందం, నరేందర్‌రెడ్డి, రవిగౌడ్‌, నరోత్తమ్‌రెడ్డి, విశ్వనాథం, రఘుగౌడ్‌, ఉమా పార్వతి, విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని