logo

ఆర్‌ఎంపీ, పీఎంపీలు నిబంధనలు పాటించాలి

జిల్లాలోని ఆర్‌ఎంపీ, పీఎంపీలు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని, ఒకవేళ అందిస్తే క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌-2010 ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పల్వన్‌కుమార్‌ సోమవారం హెచ్చరించారు.

Published : 23 Apr 2024 03:53 IST

పల్వన్‌కుమార్‌

వికారాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని ఆర్‌ఎంపీ, పీఎంపీలు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని, ఒకవేళ అందిస్తే క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌-2010 ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పల్వన్‌కుమార్‌ సోమవారం హెచ్చరించారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలు నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని, వైద్య కేంద్రాల నామ ఫలకం (బోర్డు)పై ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే రాసుకోవాలని, పడకలు ఉండకూడదని, ఎలాంటి నమూనా (శాంపిల్‌) మందులు, యాంటిబయోటిక్స్‌ వినియోగించకూడదని పేర్కొన్నారు. ఆయుష్‌ వైద్యులు అల్లోపతి వైద్యం చేయరాదన్నారు. అర్హత కలిగిన వైద్యులు తప్పనిసరిగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో నమోదు చేసుకున్న అనంతరమే ప్రాక్టీస్‌ చేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని