logo

స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు.

Published : 24 Apr 2024 02:20 IST

ఎంపీల నిధులు, విధులు, బాధ్యతలు ఎక్కువే..

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ: పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఎంపీల విధులు, నిధుల, బాధ్యతల గురించి కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

మండల సమావేశాలకు హాజరు కావొచ్చు

జిల్లా పరిషత్తు, పంచాయతీలు, పురపాలక సంఘాల నిర్వహణలో పార్లమెంట్‌ సభ్యులు ప్రాతినిధŸ్యం కలిగి ఉంటారు. దీనికి ఎగువ, దిగువ సభల్లో పలు శాసనాలు చేశారు. జిల్లా పరిషత్తులో జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ)లో సభ్యునిగా ఎంపీ నామినేట్‌ చేస్తారు.  

  • ఎంపీ పరిధిలోని మండలాల సర్వ సభ్య సమావేశాలు, జిల్లా స్టాండింగ్‌ కమిటీ సమావేశాలకు ఎంపీలు హాజరవుతుంటారు. గ్రామస్థాయి మొదలు జిల్లా వరకు ప్రజల ఆరోగ్య పరిరక్షణ, కాలానుగుణ వ్యాధుల నియంత్రణకు ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం)కు నిధుల కేటాయింపులో ఎంపీల బాధ్యత, పర్యవేక్షణ ఉంటుంది.  

చట్టాల రూపకల్పన, అమలులో..

చట్టాల రూపకల్పన వాటి అమలులో పార్లమెంట్‌ సభ్యులు ముఖ్య పాత్ర పోషిస్తారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాల పనితీరు, అవకతవకలు జరిగినప్పుడు ఆయా శాఖల మంత్రులను ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నిస్తారు.

1993లో ఎంపీ లాడ్స్‌ పథకం

పార్లమెంటు నియోజకవర్గాల అభివృద్ధికి ఎంపీ లాడ్స్‌ పథకం 1993లో ప్రారంభమైంది. దీనికింద ప్రతి పార్లమెంటు సభ్యునికి ఎంపీ లాడ్స్‌ నుంచి ఏడాదికి కేంద్రం రూ.5 కోట్లు కేటాయిస్తుంది. వీటిని జిల్లా పాలనాధికారుల పర్యవేక్షణలో ఎంపీల ప్రాధాన్యతతో ప్రతిపాదించిన పనులు చేపడతారు.  

  • పార్లమెంటులో సభ్యులుగా తమ వంతు పాత్రను నిర్వర్తిస్తూనే రాష్ట్రంలోని తన నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ముఖ్యపాత్ర పోషిస్తారు.పర్యవేక్షిస్తారు.  

ప్రభుత్వ పథకాలపై పర్యవేక్షణ

ఎంపీల నియోజకవర్గం, జిల్లా పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే పథకాల పనితీరును, ఫలితాలను తరచూ పర్యవేక్షిస్తారు. ఉదాహరణకు జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్‌ఆర్‌డీడబ్ల్యుపీ), జిల్లా నీటి పారిశుద్ధ్య మిషన్‌ (డీడబ్లుఎస్‌ఎం)ల ఏర్పాటు పూర్తిగా ఎంపీలు పర్యవేక్షిస్తారు. దీనిలో ఎమ్మెల్యేలు సభ్యులుగా కొనసాగుతారు.

  • ఎంపీ ల్యాడ్స్‌ నిధుల్లో ఏడాదిలో 15శాతం ఎస్సీల నివాస స్థలాల్లో అభివృద్ధి పనులకు కేటాయించాలి. జిల్లా పాలనాధికారి ఆ ప్రాంతాలను ప్రతిపాదిస్తారు. ఒక నియోజకవర్గంలో ఎస్టీలు లేకపోతే ఆ నిధులను కూడా ఎస్సీల నివాస స్థలాల పరిధిలో ఉపయోగించవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని