logo

ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!

క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు సూచించారు.

Updated : 24 Apr 2024 10:03 IST

క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు సూచించారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కలిగించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు.

న్యూస్‌టుడే, గాంధీ ఆసుపత్రి


 చేయాల్సినవి

  • ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్‌ ఉపయోగించాలి.
  • కాటన్‌ దుస్తులు ధరించాలి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకూడదు.
  • తేలికపాటి ఆహారం తినాలి. ప్రయాణంలో తాగునీరు వెంట తీసుకెళ్లాలి.
  • తరచూ నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలి.
  • చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలి.
  • ఎండదెబ్బకు గురైనవారు ఓఆర్‌ఎస్‌ లేకుంటే, ఒక లీటరు నీటిలో చిటికెడు ఉప్పు, చారెడు పంచదారను కలిపి తాగాలి (తాగించాలి).
  • ఎండదెబ్బ తగిలినవారిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అత్యవసర పరిస్థితిలో వైద్యులను సంప్రదించాలి.

చేయకూడనివి

  • మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు బయటకు వెళ్లకూడదు.
  • నల్లటి దుస్తులు వేసుకోవద్దు. మద్యం, టీ, కాఫీ, శీతల పానీయాలు తాగకూడదు.
  • మాంసాహారం, నిల్వ ఉన్న ఆహారం తినకూడదు.
  • చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఎండలోకి వెళ్లకూడదు.
  • గుండె జబ్బులు, షుగర్‌, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదు.
  • దాహం వేసినప్పుడు కూల్‌డ్రింక్స్‌ తాగకూడదు. సొంత వైద్యం చేయకూడదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని