logo

కంటోన్మెంట్‌లో మూడు నామినేషన్లు దాఖలు

ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్‌బీఐ అశోక్‌నగర్‌ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్‌లోని కెనరా బ్యాంకులో

Published : 24 Apr 2024 02:38 IST

భారాస అభ్యర్థి స్థిర, చరాస్తుల వివరాలు

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మధుకర్‌నాయక్‌కు నామ పత్రాలను అందజేస్తున్న
భారాస అభ్యర్థి నివేదిత

ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్‌బీఐ అశోక్‌నగర్‌ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్‌లోని కెనరా బ్యాంకులో ఎన్నికల కోసం తెరిచిన ఖాతాలో రూ.39,90,000లు, దయానంద్‌ ఆటో సర్వీసెస్‌ డీలర్‌లో 49 శాతం వాటా, రూ.33,75,000లు విలువజేసే 450 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1,27,500లు విలువజేసే 1.5 కేజీల వెండి వస్తువులు, ఓ మహింద్రా బొలేరో కారు మొత్తం రూ.85,42,500ల విలువజేసే ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని యూనియన్‌ బ్యాంకులో రూ.86,35,454ల లోను ఉందని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,96,590ల ఆస్తి పన్ను చెల్లించినట్లు నివేదిత అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే


 భాజపా అభ్యర్థి స్థిర, చరాస్తుల వివరాలు...

 భాజపా అభ్యర్థి డాక్టర్‌ వంశతిలక్‌

ప్రస్తుతం తన చేతిలో రూ.1.50 లక్షల నగదు, తన సతీమణి డాక్టర్‌ మల్లీశ్వరి చేతిలో రూ.2 లక్షల నగదు ఉంది. రెండు సేవింగ్స్‌ ఖాతాలో రూ.60 వేలు, కరెంట్‌ ఖాతాలో రూ.10వేలు ఉన్నట్లు తెలిపారు. తన సతీమణి పేరిట ఒక బ్యాంకు  ఖాతాలో రూ.1,24,311, మరో ఖాతాలో రూ.30,80,935లు, విజయ్‌నగర్‌కాలనీ పోస్టాఫీసులో రూ.55 వేలు ఉన్నట్లు తెలిపారు. తామిద్దరి పేరిట రూ.32 వేలు, రూ.5 లక్షల చొప్పున బీమాలు ఉన్నాయని తెలిపారు. రూ.2.10 లక్షలతో కొన్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, తన సతీమణి రూ.15 లక్షలతో కొన్న కారు ఉన్నాయని తెలిపారు. తన వద్ద రూ.12 లక్షలు విలువ, సతీమణి వద్ద రూ.48 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. తన పేరిట విజయ్‌నగర్‌కాలనీలో 499 గజాల విస్తీర్ణంలో రూ.4 కోట్లు విలువజేసే ఇల్లు ఉందని, తన సతీమణి పేరిట సుమారు రూ.40 లక్షలు విలువైన రెండు ప్లాట్లు రంగారెడ్డి జిల్లా నందిగామ, నెల్లూరులో ఉన్నాయని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తన సతీమణి రూ.19,84,460ల ఆస్తిపన్నును చెల్లించినట్లు తెలిపారు. తాను 1984లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశానని, తన సతీమణి ప్రస్తుతం సిద్దిపేట్‌ జిల్లాలో డిప్యూటీ జిల్లా మెడికల్‌, హెల్త్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారని డాక్టర్‌ వంశతిలక్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని