logo

నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు

లోక్‌సభ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి.

Published : 24 Apr 2024 02:51 IST

మల్కాజిగిరిలో అత్యధికంగా 16 దాఖలు

చేవెళ్ల లోక్‌సభ భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ మంగళవారం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. ర్యాలీలో మాజీ మంత్రి కేటీఆర్‌,
ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌, కాలె యాదయ్య, సబితారెడ్డి పాల్గొన్నారు.

ఈనాడు, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, రాజేంద్రనగర్‌, మేడ్చల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. చేవెళ్ల స్థానానికి డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి (కాంగ్రెస్‌), కాసాని జ్ఞానేశ్వర్‌ (భారాస) నామపత్రాలను ఆర్వో కె.శశాంకకు సమర్పించారు. మల్కాజిగిరి స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి (భారాస) తరఫున పార్టీ కార్యకర్తలు ఆర్వో గౌతమ్‌కు నామినేషన్‌ అందించారు. హైదరాబాద్‌ స్థానానికి మహ్మద్‌ వలివుల్లా సమీర్‌ (కాంగ్రెస్‌), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీతో కలిసి నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి అనుదీప్‌ దురిశెట్టికి సమర్పించారు. మల్కాజిగిరి స్థానానికి 16, చేవెళ్ల 14, సికింద్రాబాద్‌కు 11 నామినేషన్లు వేశారు.

కంటోన్మెంట్‌లో మూడు.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. నివేదిత (భారాస), డాక్టర్‌ వంశతిలక్‌ (భాజపా), ఈ.శంకర్‌ (స్వతంత్ర) సమర్పించారు.

నేడు పలువురు..: బుధవారం హైదరాబాద్‌ స్థానానికి కె.మాధవీలత (భాజపా), ఇక్కడి నుంచే గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ (భారాస), సికింద్రాబాద్‌ నుంచి దానం (కాంగ్రెస్‌)   నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

హైదరాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేస్తున్న మహ్మద్‌ వలివుల్లా సమీర్‌, చిత్రంలో ప్రభుత్వ సలహాదారు షబ్టీర్‌ అలీ తదితరులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని