logo

నేతల చూపు యువత వైపు

పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.

Updated : 24 Apr 2024 05:02 IST

నామినేషన్ల పర్వం నుంచి ప్రచారం వరకు...
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా బైక్‌ ర్యాలీలు, ఇతరత్రా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నామినేషన్‌ పర్వం నుంచి ప్రచారం వరకు యువత ఎక్కువ మంది ఉండేలా నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్థానిక నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువతను ఆకట్టుకునేందుకు అన్ని రకాలుగా నేతలు సిద్ధమవుతున్నారు. వారి బైక్‌కు పెట్రోలు ఇతర ఖర్చులు అభ్యర్థులే భరిస్తున్నారు.  ఎండలు మండిపోతుండటంతో డబ్బులు ఇస్తామన్నా చాలామంది ప్రచారంలో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ప్రచారంపై ఇంకా పూర్తి స్థాయిలో దృష్టిపెట్టడం లేదు. చివరి పది రోజులపాటు ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆలోపు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న యువతపై దృష్టి పెట్టి వారి ద్వారా ప్రచారం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సోషల్‌ మీడియా వేదికగా...

సామాజిక మాధ్యమాల వినియోగంలో  యువతదే కీలక పాత్ర. దీంతో పార్టీలు వారినే లక్ష్యంగా రకరకాల వీడియోలు రూపొందించి వదులుతున్నాయి.అవి వైరల్‌ అయ్యేలా ప్రత్యేక బృందాలను నియమించుకొని మరీ అమలు చేస్తున్నాయి. ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉన్న గ్రూపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే  ఎన్నికల నిబంధనలపై యువత అవగాహన కల్పించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని