logo

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో టిక్కెట్‌ కౌంటర్ల పెంపు

వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్‌ కోడ్‌తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది.

Published : 24 Apr 2024 03:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్‌ కోడ్‌తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. దీంతో స్టేషన్‌లో మరో 5 టిక్కెట్‌ బుకింగ్‌ కేంద్రాలను పెంచారు. ప్రతిరోజూ ప్రయాణించేవారి సంఖ్య 1.80 లక్షలుంటే.. పండగ సెలవులు కావడంతో 2.20 లక్షల వరకూ ఉంటున్నారు. వీరిలో సాధారణ ప్రయాణికులే ఎక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని