logo

జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్‌హాట్‌ డీఐ సస్పెన్షన్‌ ?

మంగళ్‌హాట్‌ ఠాణా డీఐ(డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌) మహేందర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడినట్లు సమాచారం.

Published : 25 Apr 2024 05:20 IST

ధూల్‌పేట, న్యూస్‌టుడే: మంగళ్‌హాట్‌ ఠాణా డీఐ(డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌) మహేందర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడినట్లు సమాచారం. కొందరు జూదరులు, గంజాయి వ్యాపారులతో కలిసి జూద గృహంలోనే డీఐ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై వేటు పడినట్లు సమాచారం. ఈ వ్యవహారం సీపీ దృష్టికి రావడంతో బుధవారం కార్యాలయానికి పిలిపించి ఉత్తర్వుల కాపీని చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన గురుతర బాధ్యతను డీఐ విస్మరించి.. తన పుట్టిన రోజు వేడుకల్ని జూదం నిర్వహిస్తున్న స్థావరంలోనే జరుపుకొన్నట్లు కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్‌ కావడం విశేషం. విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఇన్‌స్పెక్టర్‌ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు అర్ధరాత్రి పూట జూద గృహానికి వెళ్లినట్లు, అక్కడే కేక్‌ కోసి జూదరులతో సంబరాలు చేసుకున్నట్లు తేలింది. ఠాణా పరిధిలోని గంజాయి విక్రేతలు, జూదం నిర్వహిస్తున్న వ్యక్తులు, రౌడీషీటర్లతో చనువుగా మెలుగుతూ అంతా తానై వ్యవహరిస్తున్నట్లు ప్రస్తుతం గుసగుసలు మొదలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని