logo

తెలంగాణలో భాజపా ముందంజ

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ గాలి వీస్తుందని తెలంగాణలో వన్‌ సైడ్‌ వేవ్‌ నడుస్తుందని, భాజపా పెద్ద మెజార్టీతో ముందుంటుందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు.

Published : 12 Apr 2024 02:20 IST

ఎంపీ అర్వింద్‌

మెట్‌పల్లి పట్టణం, న్యూస్‌టుడే: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ గాలి వీస్తుందని తెలంగాణలో వన్‌ సైడ్‌ వేవ్‌ నడుస్తుందని, భాజపా పెద్ద మెజార్టీతో ముందుంటుందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌లో భాజపా ఆధ్వర్యంలో చాయ్‌ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. భాజపాకు 370 పైగా సీట్లు వస్తాయని, ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకముందు భాజపా, భారాస దోస్తీ అని బద్నాం చేశారని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి 47 ఏళ్ల రాజకీయ జీవితంలో చెప్పుకో దగ్గ ఒక్క పనైనా ఎక్కడైనా చేశారా అని విమర్శించారు. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల తర్వాత జులై 4న ముత్యంపేట, బోధన్‌ చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించి, నడిపించి ఇక్కడి ప్రాంతం కళకళలాడేలా చేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో పాటు గతంలో ఎంపీగా పోటీ చేసిన రైతు నాయకులు, మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాయిరాంకాలనీలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుడు సంపత్‌ ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్‌, చెట్లపల్లి సుఖేంధర్‌గౌడ్‌, కౌన్సిలర్లు మీనా, పోచయ్య, నవీన్‌, శ్రీకాంత్‌ బొడ్ల నగేష్‌, ఆనంద్‌, వడ్డేపల్లి శ్రీనివాస్‌, ఏలేటి ముత్తయ్యరెడ్డి, శ్రీనివాస్‌, గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని