logo

దుప్పిని వధించిన ముగ్గురి అరెస్టు

రామగుండం నగరపాలక సంస్థ 19వ డివిజన్‌ న్యూమారేడుపాకలో దుప్పిని వధించి మాంసం విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు గోదావరిఖని రెండో పట్టణ సీఐ రవీందర్‌ గురువారం తెలిపారు.

Updated : 12 Apr 2024 05:43 IST

యైటింక్లయిన్‌కాలనీ, న్యూస్‌టుడే: రామగుండం నగరపాలక సంస్థ 19వ డివిజన్‌ న్యూమారేడుపాకలో దుప్పిని వధించి మాంసం విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు గోదావరిఖని రెండో పట్టణ సీఐ రవీందర్‌ గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. న్యూమారేడుపాకలో కొంతమంది వ్యక్తులు దుప్పిని వధించి మాంసం విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీ చేపట్టామన్నారు. న్యూమారేడుపాకకు చెందిన లొకిని మల్లేష్‌, గంట మోహన్‌తోపాటు కాలనీలోని సంతోష్‌నగర్‌కు చెందిన బండారి సురేందర్‌లు దుప్పి మాంసం విక్రయిస్తూ పట్టుబడినట్లు తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకొని దుప్పి తల, కాళ్లు, మాంసాన్ని స్వాధీనం చేసుకొని జిల్లా అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఎస్సై సనత్‌కుమార్‌, పోలీసు సిబ్బందిని సీఐ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని