logo

ప్రత్యేక ప్రార్థనలు.. దైవ సందేశాలు

ఈద్‌-ఉల్‌-ఫితర్‌ వేడుకలు గురువారం జిల్లాలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.  కరీంనగర్‌లో రేకుర్తి సాలెహనగర్‌, చింతకుంట, ఒకటో ఠాణా ముందు మసీదుల్లో నమాజ్‌లు, గురువుల సందేశాలను విన్నారు.

Published : 12 Apr 2024 02:41 IST

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఈద్‌-ఉల్‌-ఫితర్‌ వేడుకలు గురువారం జిల్లాలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.  కరీంనగర్‌లో రేకుర్తి సాలెహనగర్‌, చింతకుంట, ఒకటో ఠాణా ముందు మసీదుల్లో నమాజ్‌లు, గురువుల సందేశాలను విన్నారు. అనంతరం ఖబరస్థాన్‌లో పితృదేవతల సమాధులపై గులాబీలు చల్లి ప్రార్థనలు చేశారు. భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌, మేయర్‌ వై.సునీల్‌రావు, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.  వైద్య, మున్సిపల్‌, పోలీసు, అగ్నిమాపక శాఖలు సేవలందించాయి. రేకుర్తి సాలేహనగర్‌ ఈద్గాలో ధార్మిక పండితుడు ముఫ్తి ఘియాస్‌ మొహియోద్దీన్‌ మాట్లాడుతూ.. ధర్మం, రాజకీయం వేరు కాదని ఒక దాంతో ఒకటి ముడిపడి ఉందని.. ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని దేశాన్ని రక్షించేందుకు సెక్యులర్‌ వాదులకు ఓటేయ్యాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని