logo

నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు

సమీకృత పాలనా ప్రాంగణంలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణపై మంగళవారం కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ రామగుండం సీపీ శ్రీనివాస్‌లు సంయుక్తంగా పరిశీలించారు.

Published : 17 Apr 2024 05:17 IST

కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌
సీపీతో కలిసి భద్రతపై పరిశీలన

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : సమీకృత పాలనా ప్రాంగణంలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణపై మంగళవారం కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ రామగుండం సీపీ శ్రీనివాస్‌లు సంయుక్తంగా పరిశీలించారు. ప్రధాన ద్వారం నుంచి కలెక్టర్‌ ఛాంబర్‌ వరకు భద్రతపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. నామపత్రాల దాఖలుకు సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు. నామపత్రాల స్వీకరణతో పాటు పరిశీలన, ఉపసంహరణ, పోటీలో నిలిచే అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో పారదర్శకత పాటించనున్నామని తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే వారి నామినేషన్‌ ప్రక్రియ త్వరగా ముగియనుందని తెలిపారు. మూడంచెల భద్రతతో రక్షణ కల్పిస్తున్నామని రామగుండం సీపీ శ్రీనివాస్‌ తెలిపారు. పోలీసు బలగాలతో పహారా ఉంటుందని పేర్కొన్నారు.ర్యాలీలు నిర్వహించే అభ్యర్థులు ముందుగా సువిధ యాప్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాహనాల అనుమతి, పార్కింగ్‌ సౌకర్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో డీసీపీ చేతన, ఏసీపీ కృష్ణ, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని