logo

గంజాయి మాయం కేసులో పురోగతి?

సారంగాపూర్‌ పోలీసు స్టేషన్‌ నుంచి మాయమైన గంజాయి కేసులో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Published : 17 Apr 2024 05:25 IST

సారంగాపూర్‌, న్యూస్‌టుడే: సారంగాపూర్‌ పోలీసు స్టేషన్‌ నుంచి మాయమైన గంజాయి కేసులో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. గతేడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి సారంగాపూర్‌ మీదుగా అంబులెన్సులో రాజస్థాన్‌కు 70 కిలోల గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అప్పటి నుంచి సారంగాపూర్‌లో అంబులెన్సుతో సహ గంజాయిని ఠాణా పరిధిలో వాహనంలోనే ఉంచారు. ఈనెల 1న అంబులెన్సు నుంచి గంజాయి మాయమైనట్లు వెలుగులోకి రావడంతో ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ సీరియస్‌గా తీసుకుని అప్పటి నుంచి ప్రత్యేక పోలీసుల బృందాలతో వివిధ ప్రాంతాల్లో విచారణ ప్రారంభించారు. ఇందుకు ప్రత్యేక డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌టీంల సీసీ కెమెరాల ద్వారా విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా వివిధ మండలాలకు చెందిన పలువురిని తీసుకొచ్చి విచారణ జరపారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో విచారణలో జాప్యం జరగడమే కాకుండా గతంలో గంజాయి తరలించిన నేరస్థులలో పలువురిని కూడా విచారించారు. చివరికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు సారంగాపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఉంచిన అంబులెన్సులోని గంజాయి సంచులను అద్దాలు పగులగొట్టి ద్విచక్ర వాహనంపై తరలించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు సేకరిస్తుండగా ఒకట్రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి అరెస్టు చూపనున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు