logo

రాముడి క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఒక వైపు ఆలయాలు ముస్తాబవుతుండగా, మరోవైపు ఆర్టీసీ బుధవారం ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది.

Published : 17 Apr 2024 05:32 IST

కరీంనగర్‌ రవాణావిభాగం, న్యూస్‌టుడే: శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఒక వైపు ఆలయాలు ముస్తాబవుతుండగా, మరోవైపు ఆర్టీసీ బుధవారం ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. భద్రాచలం, వేములవాడ, ఇల్లందకుంటలో జరిగే రాములోరి కల్యాణ వేడుకలకు అదనపు బస్సులు తిప్పనున్నారు. వేములవాడకు రీజియన్‌లోని పలు డిపోల నుంచి 160 అదనపు బస్సులు నడపనున్నారు. హుస్నాబాద్‌, హుజూరాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, కోరుట్ల, మెట్‌పల్లి, రాజన్న సిరిసిల్ల, జేబీఎస్‌, వరంగల్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు.  గోదావరిఖని, హుస్నాబాద్‌, కరీంనగర్‌-2, కోరుట్ల, మెట్‌పల్లి డిపోల నుంచి భద్రాచలానికి పది బస్సులు తిప్పనున్నారు. జమ్మికుంట మండలంలోని ఇల్లందకుంట శ్రీసీతా రామాలయానికి హుజూరాబాద్‌ డిపో నుంచి అదనపు బస్సులు నడపనున్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్‌ అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ రజనీకృష్ణ సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని