logo

ఇంటి నుంచే ఓటింగ్‌పై అధికారులకు శిక్షణ

ఇంటినుంచే ఓటింగ్‌పై పాటించాల్సిన నిబంధనలపై అధికారులకు మంథని శాసనసభ సెగ్మెంట్‌ అధికారి హనుమనాయక్‌ అవగాహన కల్పించారు. శుక్రవారం మంథని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు శిక్షణ ఇచ్చారు.

Published : 20 Apr 2024 04:47 IST

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆర్డీవో హనుమనాయక్‌

మంథని, న్యూస్‌టుడే : ఇంటినుంచే ఓటింగ్‌పై పాటించాల్సిన నిబంధనలపై అధికారులకు మంథని శాసనసభ సెగ్మెంట్‌ అధికారి హనుమనాయక్‌ అవగాహన కల్పించారు. శుక్రవారం మంథని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు శిక్షణ ఇచ్చారు. సహాయ రిటర్నింగ్‌ అధికారి హనుమనాయక్‌ మాట్లాడుతూ.. అర్హులైన 85 ఏళ్ల వయస్సు పైబడ్డ సీనియర్‌ సిటిజన్స్‌ పీడబ్ల్యూడీగా ఆన్‌లైన్లో మార్క్‌ చేసిన ఓటర్లు ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవచన్నారు. మే 3న తొలి విడత ఓటింగ్‌ ఉంటుందన్నారు. హోమ్‌ ఓటింగ్‌ నిబంధనలు, మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. దరఖాస్తుల ప్రకారం హోమ్‌ ఓటింగ్‌ టీంలను ఏర్పాటు చేస్తామని, ప్రతి బృందంలో పోలింగ్‌ అధికారులు, మైక్రో అబ్జర్వర్స్‌, వీడియో గ్రాఫర్స్‌ ఉంటారని పేర్కొన్నారు. టీంల వారీగా రూట్‌ మ్యాప్‌ను అనుసరించి హోమ్‌ ఓటింగ్‌ నిర్వహించాలన్నారు. మంథని తహసీల్దార్‌ రాజయ్య, హోమ్‌ ఓటింగ్‌ నోడల్‌ అధికారి రవికుమార్‌, పది మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని