logo

కరీంనగర్‌లో రూ.15.81 లక్షల పట్టివేత

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శుక్రవారం పోలీసులు  కరీంనగర్‌లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ.15.81 లక్షల నగదును పట్టుకున్నట్లు కమిషనర్‌  కార్యాలయం తెలిపింది.

Published : 20 Apr 2024 04:49 IST

 

పట్టుబడిన నగదును చూపుతున్న సీఐ సరిలాల్‌

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శుక్రవారం పోలీసులు  కరీంనగర్‌లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ.15.81 లక్షల నగదును పట్టుకున్నట్లు కమిషనర్‌  కార్యాలయం తెలిపింది. నగరంలోని రాజీవ్‌చౌక్‌ వద్ద దుర్గమ్మగడ్డకు చెందిన జనగం సుమన్‌ కళ్యాణ్‌ వద్ద రూ.7 లక్షలను ఒకటో ఠాణా పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణచౌక్‌ వద్ద మానకొండూర్‌కు  చెందిన నెల్లి భాస్కర్‌ నుంచి రూ.1,11,900 నగదు, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్ద కోతిరాంపూర్‌కు చెందిన కోల ప్రదీప్‌కుమార్‌ నుంచి రూ.5,70,000 రెండో ఠాణా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడో ఠాణా పరిధిలోని కట్టారాంపూర్‌కు చెందిన గాండ్ల సురేష్‌ వద్ద రూ.2 లక్షలు పట్టుకున్నారు. పట్టుబడిన నగదును ఎన్నికల పర్యవేక్షణ అధికారులకు అప్పగించారు.

రాయపట్నంలో ..

ధర్మపురి గ్రామీణం, న్యూస్‌టుడే: అంతర జిల్లా సరిహద్దు రాయపట్నం చెక్‌పోస్ట్‌ వద్ద డీఎస్పీ రఘుచందర్‌ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేస్తుండగా రూ.2 లక్షల నగదు పట్టుకున్నట్లు ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి శుక్రవారం తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా తనిఖీలు చేస్తుండగా ఎటువంటి ధ్రువ పత్రాలు లేకుండా ఓ వాహనంలో తీసుకెళ్తున్న నగదును పట్టుకుని సీజ్‌ చేశామన్నారు. తనిఖీల్లో ఎస్సై ఉదయ్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

వేములవాడలో..

వేములవాడ, న్యూస్‌టుడే: వేములవాడ పట్టణంలో శుక్రవారం రూ.5.67 లక్షల నగదు  పట్టుకున్నట్లు ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రభాకర్‌ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదురు వీధిలో ఎలాంటి పత్రాలు లేకుండా డబ్బును తరలిస్తున్నారన్న సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేయగా ఈ నగదు పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు. సీజ్‌ చేసి ఆర్డీవో కార్యాలయంలో అప్పగించినట్లు తెలిపారు. ఈ తనిఖీలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం సభ్యులు శ్రీనివాస్‌, భిక్షపతి, వీడియోగ్రాఫర్‌ రాజయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని