logo

గంగుల, బండిల స్నేహం అందరికీ తెలుసు

కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఎంపీ బండి సంజయ్‌ల మధ్య స్నేహం అందరికీ తెలుసునని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను ఓడించేందుకు గంగుల కమలాకర్‌ భాజపాతో కుమ్మకైనట్లు ఆరోపించారు.

Published : 20 Apr 2024 04:59 IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌

వాకర్స్‌తో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌, చిత్రంలో కాంగ్రెస్‌ నాయకులు

కరీంనగర్‌ రాంనగర్‌, న్యూస్‌టుడే: కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఎంపీ బండి సంజయ్‌ల మధ్య స్నేహం అందరికీ తెలుసునని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను ఓడించేందుకు గంగుల కమలాకర్‌ భాజపాతో కుమ్మకైనట్లు ఆరోపించారు. మంత్రి శుక్రవారం కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ స్టేడియంలో కాంగ్రెస్‌ నాయకులు, వాకర్స్‌తో కలిసి ఉదయపు నడకలో పాల్గొని మాట్లాడారు. విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకురావడానికి ఎలక్ట్రోరల్‌ బాండ్లను రూపొందించామని ప్రధాని మోదీ చెప్పడం నేరుగా అవినీతిని ప్రోత్సహించడమేనన్నారు. ప్రభుత్వం కూలుతుందని భారాస నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కబ్జాలపై చర్యలు తీసుకుంటున్నామని.. పేదల భూములను ఆక్రమిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. కరీంనగర్‌ తీగల వంతెనపై విజిలెన్స్‌ విచారణ జరుగుతుందని అవినీతికి పాల్పడిన వారు జైలుకు వెళ్తారన్నారు. కాంగ్రెస్‌ కరీంనగర్‌ అసెంబ్లీ ఇన్‌ఛార్జి పురుమల్ల శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నాయకుడు వెలిచాల రాజేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని