logo

బెదిరింపు రాజకీయాలు సరికాదు

కాంగ్రెస్‌ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు.

Published : 25 Apr 2024 04:11 IST

సాటాపూర్‌ కూడలి వద్ద మాట్లాడుతున్న బాజిరెడ్డి గోవర్ధన్‌

రెంజల్‌, నవీపేట, న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం సాటాపూర్‌ కూడలి, నవీపేట మండలకేంద్రంలో బుధవారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. హమీలన్నీ అమలు చేస్తామని మోసం చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి, అయిదు రోజులలోపు పసుపుబోర్డు తెస్తానని నమ్మించిన భాజపా అభ్యర్థి అర్వింద్‌ను ఓడించాలని ప్రజలను కోరారు. మాజీ సీఎం వైఎస్‌తోనే అసలు కాంగ్రెస్‌ అంతమైందని.. హామీలతో మోసం చేస్తున్న ప్రస్తుత డూప్లికేట్‌ కాంగ్రెస్‌ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దన్నారు. రైతుబంధు, రూ.2 లక్షల రుణమాఫీ వంటి హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేదన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి చక్కెర కర్మాగారాన్ని ఎందుకు తెరిపించలేకపోయారో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తనను గెలిపిస్తే కందకుర్తి త్రివేణి సంగమాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని, నవీపేటలో ఆర్వోబీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకుపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని