logo

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే హవా

ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్‌ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు.

Published : 25 Apr 2024 04:16 IST

ప్రథమంలో 52.76, ద్వితీయంలో 64.3 శాతం ఉత్తీర్ణత

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్‌ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో అమ్మాయిలు ప్రథమ సంవత్సరంలో 1,582, ద్వితీయంలో 1,647 మంది పాసయ్యారు. మొత్తానికి ప్రథమ సంవత్సరం 52.76 శాతం, ద్వితీయ సంవత్సరం 64.3 శాతం ఉత్తీర్ణులయ్యారు. గతేడాది ప్రథమంలో 10వ స్థానం, ద్వితీయంలో 11వ స్థానంలో నిలవగా, ఈసారి ప్రథమం 13, ద్వితీయం 16 స్థానాలకు పడిపోయాయి. జిల్లాలో పది ప్రభుత్వ కళాశాలలతో పాటు ఎయిడెడ్‌, ఆదర్శ, కేజీబీవీ, గురుకుల, ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలు కలిపి 50 ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో ఎం.డి.రెహాన్‌ ఎంపీసీలో 454/470, సిరిసిల్ల జూనియర్‌ కళాశాలకు చెందిన సాహిమిత్ర బైపీసీలో 425/440 మార్కులు సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో సిరిసిల్ల జూనియర్‌ కళాశాల నుంచి ఎం.నవ్య 959/1000, వి.తనుజా 957/1000, రుద్రంగి జూనియర్‌ కళాశాల విద్యార్థిని నిహితా బైపీసీ 919/1000 మార్కులతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ స్థానంలో నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు