logo

పేదింటి బిడ్డలు ఇంటర్‌లో మెరిశారు

కరీంనగర్‌ విద్యావిభాగం, భాగ్యనగర్‌, న్యూస్‌టుడే : ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు.

Published : 25 Apr 2024 04:27 IST

కరీంనగర్‌ విద్యావిభాగం, భాగ్యనగర్‌, న్యూస్‌టుడే : ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. కార్పొరేట్‌ కళాశాలల విద్యార్థులకు తాము ఏమాత్రం తీసిబోమని నిరూపించారు.

సుదూర ప్రాంతం నుంచి..

చొప్పదండి : ముత్తారం మండలం గద్దపాకకు చెందిన సోమిడి అంజలి చొప్పదండిలోని బాలికల గురుకుల కళాశాలలో చదివి 959 మార్కులు సాధించింది. ఆమె తల్లిదండ్రులు ప్రభాకర్‌, సవిత వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటారు. భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగేందుకు కష్టపడతానని ఆమె పేర్కొంది.

తల్లిదండ్రులు గర్వపడేలా...

మానకొండూర్‌, న్యూస్‌టుడే: మానకొండూర్‌ మండలం దేవంపల్లి గురుకుల విద్యాలయ ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థి గణేష్‌ ఎంపీసీలో 976 మార్కులు సాధించి సత్తాచాటాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లికి చెôదిన మణేమ్మ-గంగాధర్‌ కూలీ దంపతుల కుమారుడైన గణేష్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరై తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తానన్నారు.

కళాశాల టాపర్‌

శంకరపట్నం : హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన తాటికొండ కవిత-నాగరాజు దంపతుల కూతురు అక్షయ కేజీబీవీలో చదువుతూ బైపీసీలో 963 మార్కులు సాధించింది. ఆ కళాశాలలో టాపర్‌గా నిలిచింది. ఉపాధ్యాయులు సహకరించారని పేర్కొంది. ప్రస్తుతం ఎంసెట్‌ శిక్షణ తీసుకొంటుంది.

కేజీబీవీ విద్యార్థి ప్రతిభ

జమ్మికుంట: మండలంలోని సైదాబాద్‌కు చెందిన కె.సాయిచందన జమ్మికుంట కేజీబీవీలో ఎంపీసీ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతూ 957 మార్కులు సాధించి విద్యాలయంలో మొదటి ర్యాంకు పొందింది. సాయిచందన తండ్రి గోపాల్‌ ఎకర భూమిలో పత్తి సాగు చేస్తూ.. తల్లి రమ కూలీ పనులతో కుటుంబాన్ని పోషిస్తున్నారు.

తతల్లే చదివించింది

వీణవంక: వీణవంక మండలం కొండపాకకు చెందిన ఈదునూరి అభినయ్‌ గన్ముకుల ఆదర్శ పాఠశాలలో ఎంపీసీ చదివి 970 మార్కులు సాధించాడు. తండ్రి మధునయ్య చనిపోగా.. తల్లి కవిత కూలీ పనులు చేసుకుంటూ కుమారుడిని చదివించింది. అభినయ్‌ను ప్రిన్సిపల్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.

చేనేత బిడ్డ.. మార్కుల్లో దిట్ట

గంగాధర : గంగాధర మండలం గర్శకుర్తికి చెందిన అంబటి రమేష్‌ చేనేత కార్మికుడిగా, జ్యోతి బీడీ కార్మికురాలిగా పనులు చేస్తూ కొడుకు శ్రావణ్‌ను న్యాలకొండపల్లి ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో చదివించారు. ఎంపీసీలో 970 మార్కులతో ప్రతిభ చాటాడు. ఈయన పదో తరగతి వరకు గన్నేరువరంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివాడు. 

ఇంజినీర్‌ అవుతా..

చొప్పదండి : చొప్పదండికి చెందిన నేతన్న సందుపట్ల రాజు, లావణ్య కూతురు వన్య స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ చదివి 961 మార్కులు సాధించింది. ప్రణాళిక ప్రకారం చదివి మంచి మార్కులు సాధించింది. భవిష్యత్తులో ఇంజినీర్‌ కావడమే లక్ష్యమని పేర్కొంది.

డాక్టర్‌ కావడమే లక్ష్యం..

శంకరపట్నం : కొత్తగూడెంకు చెందిన కారం రాజేశ్వరీ-రమేశ్‌కుమార్‌ల కుమార్తె స్రవంతి స్థానిక కేజీబీవీలో బైపీసీ రెండో ఏడాది చదువుతూ 961 మార్కులు సాధించింది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కష్టపడి చదివింది. భవిష్యత్తులో ఎంబీబీఎస్‌ చదివి డాక్టర్‌ కావడమే తన లక్ష్యమని పేర్కొంది.  

సివిల్‌ సర్వీసెస్‌ సాధిస్తా

మానకొండూర్‌ : దేవంపల్లి గురుకుల విద్యాలయంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో శామ్యూల్‌ 959 మార్కులు సాధించి ప్రతిభ కనబర్చాడు. శామ్యూల్‌ జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటిక్యాలకు చెందిన కూలీ దంపతులు బొమ్మ లక్ష్మి-భూమరాజంల కుమారుడు. సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక కావడమే తన లక్ష్యమని తెలిపాడు.

అమ్మానాన్నల కష్టం చూసి..

జమ్మికుంట : హనుమకొండ జిల్లాకు చెందిన మొగిలి-రాధ దంపతులు ఇల్లందకుంట మండలం బుజూనూరుకు వచ్చి స్థిరపడ్డారు. మొగిలి కూలీ పని, రాధ గాజుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి చిన్న కుమారుడు శరత్‌ జమ్మికుంట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 943 మార్కులు పొంది కళాశాలలో మొదటి ర్యాంకు సాధించాడు.

డాక్టర్‌గా సేవలందిస్తా..

హుజూరాబాద్‌ పట్టణం : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బీపీసీ రెండో సంవత్సరంలో కుసుంబ కృష్ణకౌశిక్‌ 937మార్కులు పొందాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం మరిపల్లిగూడెం పరిధి జుజునూర్‌పల్లికి చెందిన వ్యవసాయ కూలీ దంపతులు మోహన్‌రావు-పద్మల కుమారుడు కృష్ణకౌశిక్‌. డాక్టర్‌ చదివి నిరుపేదలకు సేవలందిస్తానని వెల్లడించారు.

ఐఏఎస్‌ టార్గెట్‌

గంగాధర : తల్లిదండ్రులు గంగాధర్‌, రేణుక వ్యవసాయ కూలీలు.. పేదరికం వెంటాడినా చదువుకోవాలనే పట్టుదలతో గంగాధరలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కొండాయపల్లికి చెందిన కట్కం రుషికేష్‌ చదివి ఎంపీసీలో 935 మార్కులు సాధించాడు.  భవిష్యత్తులో ఐఏఎస్‌ సాధిస్తానని రుషికేష్‌ ధీమా వ్యక్తం చేశాడు.  

ఉన్నత స్థాయికి ఎదుగుతాల్లే చదివించింది

ఉన్నత స్థాయికి ఎదుగుతా

హుజూరాబాద్‌ పట్టణం Ë: హుజూరాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ విభాగంలో అపరాధ అనుష్క 931 మార్కులను సాధించింది. హుజూరాబాద్‌ మున్సిపల్‌ పరిధి దమ్మక్కపేటకు చెందిన రవీందర్‌-తిరుమలల కుమార్తె అనుష్క.. వీరు వ్యవసాయం చేస్తారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయి ఉన్నతస్థాయికి ఎదగాలని ఉందని చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని