logo

రాజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామివారి క్షేత్రానికి శనివారం భక్తుల తాకిడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు.

Published : 19 May 2024 03:29 IST

స్వామివారికి మొక్కుతున్న భక్తులు 

వేములవాడ, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామివారి క్షేత్రానికి శనివారం భక్తుల తాకిడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసరాలు, కల్యాణకట్ట, ఆలయ ధర్మగుండం, క్యూలైన్లు రద్దీగా మారాయి. కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్న అనంతరం ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను కుటుంబ సమేతంగా చెల్లించుకున్నారు. పరివార దేవతలను దర్శించుకొని తరించారు. పలువురు భక్తులు స్వామివారికి అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజ, సత్యనారాయణ వ్రతాలు, కల్యాణాలు వంటి పూజా కార్యక్రమాలు జరిపించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. గండాలు తొలగాలని గండా దీపంలో నూనె పోసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ చేశారు. దాదాపు 20 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని